హోటల్‌లో రూమ్‌ కావాలని వెళ్లిన నటికి చేదు అనుభవం | Sakshi
Sakshi News home page

హోటల్‌లో రూమ్‌ కావాలని వెళ్లిన నటికి చేదు అనుభవం

Published Fri, May 10 2024 8:49 PM

Actress Pranit Hatte Shares Shocking Experience For Hotel Room

మరాఠీ నటి ప్రణిత్ హట్టే లింగ వివక్షకు గురైంది. మరాఠీ సీరియల్ "కర్భారి లేభరి"తో ఆమెకు మంచి గుర్తింపు దక్కింది. ట్రాన్స్‌జెండర్ అనే కారణంతో ఒక హోటల్‌ నిర్వాహకులు లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో ఒక వీడియో ద్వారా తను ఎదుర్కొన్న అనుభవాన్ని ఆమె షేర్‌ చేసింది.

కొద్దిరోజుల క్రితం ఒక ఈవెంట్‌ కోసం  ప్రణిత్ హట్టే నాసిక్‌ వెళ్లినట్లు చెప్పింది. ఈ క్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా ముందుగానే పూజా ఇంటర్నేషనల్‌ అనే హోటల్‌లో రూమ్‌ను బుక్‌ చేసుకున్నట్లు తెలిపింది. ముందుగా గదిని బుక్ చేసుకున్నప్పటికీ, హోటల్ వారు తనకు అనుమతి లేదంటూ  నిరాకరించినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియో ద్వారా తెలిపింది. తనను అవమానించారని ఆవేదన చెందింది. తను ఒక ట్రాన్స్‌జెండర్ అనే కారణంగా గదిని ఇచ్చేందుకు నిరాకరించారని పేర్కొంది. ఇలాంటి జనరేషన్‌లో ఇంకా లింగ వివక్ష చూపించడం ఏంటి అంటూ ఆమె ప్రశ్నించింది.

ఈ సంఘటనలో నెటిజన్‌లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. హోటల్‌పై చర్య తీసుకోవాలని పిలుపునిచ్చారు. తన ప్రాథమిక హక్కులు, గౌరవాన్ని ఉల్లంఘించినందుకు హోటల్‌పై కేసు నమోదు చేయాలని కొందురు కోరుతున్నారు. మరికొందరు 2024లో ఇటువంటి వివక్ష ఆమోదయోగ్యం కాదని ఎత్తి చూపారు.

Advertisement
 
Advertisement