ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్‌ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..? | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్‌ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?

Published Thu, May 9 2024 6:04 PM

Dhanush's Son Yatra Raja Got Good Result In Board Exams

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి  యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే,  గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.

ధనుష్‌ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్‌ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్‌ 100కి 98, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్‌లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
 
Advertisement