తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | GV Prakash Kumar Kalvan Movie OTT Release Date Confirmed, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Kalvan In OTT: తమిళంలో ఇటీవలే రిలీజ్‌.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి!

Published Wed, May 8 2024 2:08 PM

GV Prakash Kumar Kalvan Movie OTT Release Date Ott

ఓవైపు సంగీత దర్శకుడిగా, మరోవైపు హీరోగా రాణిస్తున్నాడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌. అతడు ఇటీవల ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కల్వన్‌. దీన్ని తెలుగులో చోరుడు పేరిట రిలీజ్‌ చేయాలని భావించారు. ఈ మేరకు గతేడాది ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ కూడా వదిలారు. ఇవానా, భారతీరాజా కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశే సంగీతం అందించాడు. 

ఓటీటీ రిలీజ్‌ డేట్‌
ఏప్రిల్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తెలుగులో రిలీజ్‌ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది. మే 14 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నట్లు హాట్‌స్టార్‌ ప్రకటించింది. అలాగే ఇతర దేశాల్లో ఉన్నవారికోసం సింప్లీ సౌత్‌, టెన్‌కోట్టా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ మూవీ  మే 10 నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీజర్‌ కూడా వదిలారు. కల్వన్‌ సినిమా విషయానికి వస్తే పీవీ శంకర్‌ దర్శకరచయితగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గానూ పని చేశాడు. ఢిల్లీ బాబు నిర్మించిన ఈ చిత్రానికి సాన్‌ లోకేశ్‌ ఎడిటర్‌గా వ్యవహరించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement