బంగారం, మద్యం, నగదు.. ఈసీ ఇప్పటిదాకా పట్టుకున్నది ఎంతంటే.. | Gold Worth Of Rs 140 Crore, Cash And Alcohol Seized In West Bengal, Details Inside - Sakshi
Sakshi News home page

బంగారం, మద్యం, నగదు.. ఈసీ ఇప్పటిదాకా పట్టుకున్నది ఎంతంటే..

Published Sun, Mar 31 2024 12:52 PM

Gold Worth rs 140 Crore Cash ec Seized In west Bengal - Sakshi

కోల్‌కతా: ఈనెల లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ.140 కోట్ల విలువైన బంగారం, డ్రగ్స్, మద్యంతోపాటు వివిధ వస్తువులు, రూ. 7 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు.

ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం (మార్చి 30) వరకు స్వాధీనం చేసుకున్న నగదు మొత్తం రూ.7.87 కోట్లు. అలాగే రూ. 33.86 కోట్ల విలువైన 12.7 లక్షల లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక రూ. 18.28 కోట్ల విలువైన 3.5 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 27.32 కోట్ల విలువైన బంగారం పట్టుబడినట్లు పేర్కొన్నారు. 

అలాగే ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. లెక్కలో చూపని నగదుతో సహా మొత్తం ఎలక్షన్‌ కమిషన్‌ స్వాధీనం చేసుకున్న బంగారం, మద్యం, ఇతర వస్తువుల విలువ రూ.147.19 కోట్లు ఉంటుందన్నారు. 

ఇదిలా ఉండగా, కోల్‌కతా పోలీసులు నగరంలోని జోరాబాగన్ ప్రాంతంలో చేపట్టిన తనిఖీలలో రూ.82 లక్షల విలువైన సుమారు 15 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ బంగారు కడ్డీలు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా స్మగ్లింగ్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement