ఇలా అయితే టెకీలకు పెళ్లిళ్లు కష్టమే! షాకవుతున్న నెటిజన్లు.. | Sakshi
Sakshi News home page

ఇలా అయితే టెకీలకు పెళ్లిళ్లు కష్టమే! షాకవుతున్న నెటిజన్లు..

Published Fri, Apr 5 2024 9:07 PM

Unemployed Woman Rejected Engineer With 8 LPA Check The Reason - Sakshi

కాలం మారుతోంది.. ఖర్చులు పెరుగుతున్నాయి. ఉద్యోగం ఉన్నవారి పరిస్థితులు కూడా తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా కరోనా తరువాత టెకీల పరిస్థితులు వర్ణాతీతం అయిపోయింది. ఇన్నో రోజులూ జాబ్ ఎప్పుడు పోతుందో అనే భయంలో బిక్కుబిక్కుమంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మరో కొత్త సమస్య ఎదురైంది. లక్షల జీతం ఉన్నా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు నిరాకరిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసేవారిలో భారీ ప్యాకేజ్ ఉంటేనే కొంతమంది అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటన వెలుగుయూలోకి వచ్చింది. ఇందులో ఒక వ్యక్తి తన ఫ్రెండ్ పెళ్లి చూపులకు వెళ్లాడని, అక్కడ అమ్మాయి తన శాలరీ గురించి అడిగిందని వెల్లడించాడు.

అమ్మాయి శాలరీ గురించి అడిగినప్పుడు, అబ్బాయి వార్షిక వేతనం సంవత్సరానికి రూ. 8 లక్షలని చెప్పాడు. దీంతో ఆ అమ్మాయి ఆ సంబంధం రిజెక్ట్ చేసింది. కారణం ఏంటనే అడిగితే.. తనకి ఉద్యోగం లేదని.. ఆ అబ్బాయికి కనీసం ఏడాది రూ. 25 లక్షల ప్యాకేజి ఉండాలని, లేకుండా భవిష్యత్తులో కష్టాలు పడాల్సి వస్తుందని చెప్పింది. వధువు సమాధానం విని వరుని తరపు బంధువులు షాకయ్యారు.
 
ఏడాది రూ.8 లక్షలు వచ్చినా అమ్మాయి రిజెక్ట్ చేయడం గురించి ఆతని స్నేహితుని చెప్పుకున్నాడు. దీంతో ఆ స్నేహితుడు ఈ సమాచారం మొత్తం తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

అమ్మాయి ఆ మాత్రం అంచనాలు పెట్టుకోవడంలో తప్పులేదని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏడాదికి రూ. 25 లక్షలు పెంచుకునే పనిలో ఉండు అంటూ కామెంట్ చేశారు. మరికొందరు నీ ప్యాకేజీకి తగిన అమ్మాయిని పెళ్లి చేసుకో అంటూ కామెంట్ చేసాడు. ఇలా తమదైన రీతిలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement
Advertisement