No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Tue, Apr 23 2024 8:25 AM

- - Sakshi

పిన్నెల్లి నామినేషన్‌

కార్యక్రమానికి

హాజరైన జనసందోహం

మాచర్ల రూరల్‌: మాచర్ల మహాసంద్రంగా మారింది. మండుటెండను లెక్కచేయక నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పట్టణంలోని వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాచర్ల నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రెండవ సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎ.శ్యాం ప్రసాద్‌కు నామినేషన్‌ పత్రాలను అందజేశారు. పిన్నెల్లి వెంట సోదరి జవ్వాజి నాగమణి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి మరుమాముల శ్రీనివాసశర్మ, సీనియర్‌ న్యాయవాది చిలంకూరి నాగిరెడ్డి, మారం వెంకటేశ్వరరావు (లడ్డూ)లు ఉన్నారు.

ఆలయాల్లో పూజలు

మాచర్ల: ఉదయం రింగురోడ్డులోని ఆంజనేయస్వామి దేవాలయంలో పీఆర్కే ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపు మూడు గంటల సేపు దేవాలయం వద్ద వేచి ఉండి వైఎస్సార్‌సీపీ నరసరావుపేట పార్లమెంట్‌ అభ్యర్థి పోలుబోయిన అనిల్‌కుమార్‌ యాదవ్‌, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్ధరెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, సీనియర్‌ నాయకులు కొమ్మారెడ్డి చలమారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డిలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తరువాత దేవాలయం నుంచి వేలాది మంది పీఆర్కే వెంట సాగారు. రింగురోడ్డు నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా మహిళలు, రైతులు, యువకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు కేరింతలు కొడుతూ బారులు తీరారు. పార్కు సెంటర్‌కు చేరుకునే ముందు అతిథులందరికీ భారీ క్రేన్‌లతో గజమాలలు వేసి సత్కరించారు. వేలాది మందితో పట్టణమంతా కిక్కిరిసిపోయింది. ఎటుచూసిన వైఎస్సార్‌సీపీ ప్రభంజనం కనబడింది. కార్యక్రమంలో అన్నీ మండలాల ప్రజా ప్రతినిధులు, మార్కెట్‌ యార్డు చైర్మన్‌లు, మాజీ చైర్మన్‌లు, రాష్ట్ర డైరెక్టర్లు, జెడ్పిటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

పీఆర్కే నామినేషన్‌ దాఖలు

1/1

Advertisement
Advertisement