రక్తదాతలే ప్రాణదాతలు | Sakshi
Sakshi News home page

రక్తదాతలే ప్రాణదాతలు

Published Wed, Apr 10 2024 1:30 AM

రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పద్మలీల - Sakshi

విజయనగరం ఫోర్ట్‌: రక్తదాతలే ప్రాణదాతలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.పద్మలీల అన్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మంగళవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి మాత్రమే ఆపదలో ఉన్న సాటి మనిషికి రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడగలడన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ ఏడాదికి నాలుగు పర్యాయాలు రక్తదానం చేయవచ్చునని చెప్పారు. రక్తదానం చేయడం వల్ల ఎటువంటి అనారోగ్యం రాదని, నిరంతరం రక్తదానం చేయడం వల్ల రక్తం కొరత లేకుండా చేయవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిలా సునందని, డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పీఏ రమణి, ఆర్‌ఎంఓ డాక్టర్‌ ఎన్‌.సురేష్‌బాబు, డాక్టర్‌ వెంకటనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.పద్మలీల

Advertisement
Advertisement