పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు: సీఎం జగన్‌

Published Tue, May 7 2024 4:37 PM

CM Jagan Powerful Speech At Ichchapuram Public Meeting

సాక్షి, శ్రీకాకుళం: సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. భోగాపురం ఎయిర్‌పోర్టు విస్తరన పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌ కనెక్టవిటీ పెంచామని అన్నారు.

ఎన్నిక ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్‌  భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..జూన్‌ 4న విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశామన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యను పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు  కుట్రలు చేశాడని మండిపడ్డారు సీఎం జగన్‌. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశాడని దుయ్యబట్టారు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్‌లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరని స్పష్టం  చేశారు.

సీఎం జగన్‌పూర్తి  ప్రసంగం 

  • 59 నెలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం.

  • అక్కచెల్లెమ్మలకు నేరుగా రూ. 2లక్షల 70 వేల కోట్లు అందించాం.

  • 2 లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం.

  • మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాం.

  • మేనిఫెస్టోని 99 శాతం హామీలను నెరవేర్చాం.

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చాం

  • ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.

  • 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, సబ్జెక్ట్‌ టీచర్లు .

  • ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్‌ బోధన.

  • బడులు తెరిచే నాటికే విద్యాకానుక, గోరుముద్ద.

  • అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మార్పులు.

  • విద్యారంగంలో మేం చేసిన అభివృద్ధి బాబు హయాంలో జరిగిందా?.

అక్కాచెల్లెమ్మలకు తోడుగా ఉన్నాం

  • అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.

  • అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.

  • అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం.

  • అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నాం.

  • గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?

  • అవ్వాతాతలకు ఇంటి వద్దకే రూ. 3 వేల పెన్షన్‌.

  • ఇంటి వద్దకే పౌరసేవలు, సంక్షేమ పథకాలు.

  • సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం.

  • విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం.

  • గతంలో రైతన్నకు ఇంత మంచి జరిగిందా?.

  • పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం.

  • రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం.

  • గ్రామస్థాయిలోనే రైతులను చేయి పట్టుకొని నడిపించే ఆర్‌బీకే వ్యవస్థ.

  • స్వయం ఉపాధికి అండగా వాహనమిత్ర, నేతన్న నేస్తం,మత్స్యకార భరోసా.

  • .జగనన్న తోడు, చేదోడుతో చిరువ్యాపారులకు అండగా నిలిచాం.

  • నాడు-నేడు ద్వారా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చాం.

  • ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షల వరకు పెంచాం.

  • పేషెంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం.

  • ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌.

  • విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం

ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడుగులు వేశాం

  • మూడు జిల్లాలను ఆరు జిల్లాలను చేశాం.

  • ఎగ్జిక్యూటివ్‌క్యాపిటల్‌గా విశాఖనుఉద్దాన సమస్యను పరిష్కరించాం.

  • కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం.

  • జూన్‌ 4న మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు.

  • మీ బిడ్డ అధికారంలో వెంటనే మళ్లీ మొత్తం అందస్తాం.

  • చంద్రబాబు దగ్గర ప్రజల నుంచి దోచేసిన సొమ్ము చాలా ఉంది.

  • దోచేసిన సొమ్ముతో చంద్రబాబు ఓటర్లను ప్రలోభపెడతాడుబాబు డబ్బులిస్తే తీసుకోండి.. కానీ ఓటేసే ముందు ఆలోచించండి.

  • ఎవరి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగిందో ఆలోచించండి.

  • మీరు వేసే ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి.

  • ఓటు అనే అస్త్రంతో బాబుకు గట్టిగా బుద్ధి చెప్పాలి

పథకాలు ఆపగలరు కానీ.. మా విజయాన్ని ఆపలేరు

 

Advertisement

తప్పక చదవండి

Advertisement