కాంగ్రెస్ పక్షపాతం బట్టబయలైంది: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పక్షపాతం బట్టబయలైంది: ప్రధాని మోదీ

Published Fri, Apr 26 2024 3:58 PM

Congress Against Hindus for Their Vote Bank, Says Modi

పాట్నా: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ సాగుతోంది. ఈ తరుణంలో బీహార్‌లోని అరారియాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మీద కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకు కోసం భారతదేశంలోని హిందువుల పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శించిన తీరు ఈ రోజు బట్టబయలైందని మోదీ పేర్కొన్నారు. మతంతో సంబంధం లేకుండా మన దేశంలోని వనరులపై మొదటి హక్కు పేదలదేనని ప్రధాని స్పష్టం చేశారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) హక్కులను హరించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 2009 నాటి ఒక వీడియో షేర్ చేసింది. ఇందులో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ లోక్‌సభ ఎన్నికలకు ముందు మీడియాతో మాట్లాడటం చూడవచ్చు. దేశ వనరులను ముఖ్యంగా మైనారిటీలు, ముఖ్యంగా పేద ముస్లింలకు అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన కాంగ్రెస్ మునుపటి ప్రకటనలను స్పష్టం చేస్తాయి. ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఒక స్పష్టమైన విధానం అనే మా వాదనకు ఇది మద్దతు ఇస్తుంది. రిజర్వేషన్ల నుంచి వనరుల వరకు అన్నింటిలోనూ ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వాలనే కాంగ్రెస్ ఆలోచనకు ఇది మరో నిదర్శనం అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement