తిరువనంతపురం ఫైట్‌.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

తిరువనంతపురం: కేంద్ర మంత్రి రాజీవ్‌చంద్రశేఖర్‌పై ‘ఈసీ’కి ఫిర్యాదు

Published Sun, Apr 7 2024 7:43 PM

Ldf Complaint To Election Commission On Rajeev Chandrashekar - Sakshi

తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి  కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్‌(ఈసీ)కి వామపక్ష ఎల్‌డీఎఫ్‌ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్‌ సందర్భంగా రాజీవ్‌ చంద్రశేఖర్‌ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్‌లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్‌డీఎఫ్‌ నేతలు పేర్కొన్నారు.

జూపిటర్‌ క్యాపిటల్‌ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్‌ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్‌ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు.    

ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్‌ 

Advertisement
Advertisement