Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

MLC Indukuri Raghu Raju Hospitalised New Drama
AP: ఫిరాయింపు ఎమ్మెల్సీ కొత్త డ్రామా?

విజయనగరం, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు కొత్త డ్రామాకు తెర లేపారా?. సరిగ్గా శాసన మండలిలో అనర్హత పిటిషన్‌పై విచారణ నాడే ఆయన ఆస్పత్రిలో చేరడం ఆ అనుమానాలను బలపరుస్తోంది. ఎమ్మెల్సీ రఘురాజు వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి పార్టీ ఫిరాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ శాసనమండలిలో ఫిర్యాదు చేసింది. మే 27వ తేదీన విచారణకు హాజరు కావాలని మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు నోటీసులు పంపారు. అయితే ఆరోజు కారణం ఏంటో చెప్పకుండానే రఘురాజు విచారణకు గైర్హాజరు అయ్యారు. దీంతో విచారణను మే 31(ఇవాళ్టికి) వాయిదా వేశారు చైర్మన్‌. అయితే విచారణకు రాకుండా విశాఖ నారాయణ ఆస్పత్రిలో చేరారు రఘురాజు. కిడ్నీ సమస్యతో ఆయన ఆస్పత్రిలో చేరారని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు ఆయన ఇవాళ కూడా విచారణకు గైర్హాజరు కావడంతో చైర్మన్‌ మోషేన్‌ రాజు విచారణ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఎదురైంది. తదుపరి విచారణ ఎప్పుడుంటుదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.ఇటు శాసనమండలిలో.. అటు శాసనసభలోనూ చైర్మన్‌, స్పీకర్‌లు ఫిరాయింపులను తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీకి మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై శాసన సభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అనర్హత వేటు వేశారు. ఇక మండలిలోనూ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపైనా అనర్హత వేటు పడింది.

Ksr Comments On The Importance Of Kcr Behavior In The Parliamentary Elections
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్‌ టైం!

తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్‌గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్‌ఎస్‌ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్‌ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్‌ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్‌ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్‌ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్‌ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్‌ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్‌ఎస్‌ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్‌ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్‌, హరీష్‌రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్‌ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్‌ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్‌ఎస్‌ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్‌ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్‌ఎస్‌ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్‌ఎస్‌ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్‌ఎస్‌ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్‌ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్‌ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్‌ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్‌కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్‌ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి కేసీఆర్‌ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్‌ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్‌ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్‌ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్‌తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్‌ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్‌ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్‌కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Anant Ambani-Radhika's Cruise Pre-Wedding: Katy Perry Performs
అంబానీ ఇంట పెళ్లి సందడి: రెండో ప్రీ వెడ్డింగ్ బాష్‌ ఖర్చు ఎంతో తెలుసా?

బిలియనీర్‌ ముఖేష్‌ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి, అందులోనూ ఈ తరంలో చివరి పెళ్లి. అందుకే బోలెడంత సందడి. ఇది చాలదన్నట్టు ఘనంగా నిశ్చితార్థం, అంగరంగ వైభవంగా ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు.. ఇపుడు కనీవినీ ఎరుగని రీతిలో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు షురూ అయ్యాయి. దీంతో రోజుకొక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తాజాగా మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ హాట్‌ టాపిక్‌గా నిలిచింది.ముఖేష​ నీతా అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో జూలై 12న ముంబైలో జరగనుంది. దీనికి ముందుగా దక్షిణ ఫ్రాన్స్‌లో ఉన్న విల్లాలో దేశ విదేశాలకు చెందిన 800 మంది ముఖ్య అతిథులతో ఇటలీ నుండి ఫ్రాన్స్‌కు వెళ్లే మార్గంలో విలాసవంతమైన క్రూయిజ్‌లో రెండో ప్రీ-వెడ్డింగ్‌ వేడుక జరుగుతోంది. జూన్ 1, 2024న ఇటలీలోని సుందరమైన పోర్టోఫినో నగరంలో ముగుస్తుంది.తాజా సమాచారం ప్రకారం అనంత్ అంబానీ-రాధిక మూడు రోజుల ప్రీ-వెడ్డింగ్‌లో పాపులర్‌ అమెరికన్ గాయని-గేయరచయిత, కేటీ పెర్రీ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ రోజు సాయంత్రం(మే 31) డార్క్ హార్స్, రోర్, ఎలక్ట్రిక్, హార్లేస్ ఇన్ హవాయి పాటలతో ఈ గ్రాండ్‌ ఈవెంట్‌లో సందడి చేయనుంది. 'లా విటా ఇ అన్ వియాజియో' (జీవితం ఒక ప్రయాణం) థీమ్‌తో ఈ గాలా సాగుతుంది. ఇందుకు కోసం పాప్ ఐకాన్‌కు భారీ మొత్తంలోనే ముట్ట చెప్పారట. ఖర్చు రూ. 7500కోట్లురూ. 424 కోట్ల విలువైన ఎస్టేట్‌లో నిర్వహించే రెండో ప్రీ వెడ్డింగ్‌ బాష్‌ కోసం అంబానీ కుటుంబం ఏకంగా 7,500 కోట్లు రూపాయలు వెచ్చిస్తోంది. అంతేకాదు క్రూయిజ్‌లోని ప్రతి సూట్‌ స్పా, జిమ్‌, స్విమ్మింగ్ పూల్‌ మరెన్నో విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటుంది. ఒక్కోదానికి ఖర్చు సుమారు రూ. 60 లక్షలు. ఐదు గంటలు పాటు జరిగే మూడో రోజు స్పెషల్‌ ఈవెంట్‌లో డీజేలు, బాణా సంచా వెలుగులతో మోత మోగనుంది.కాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జూలై 12, 2024న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో మూడు రోజుల పాటు పెళ్లి సంబరాలు కొనసాగనున్నాయి.

Is Balakrishna facing tough time in Hindupur Assembly Fight
హిందూపురంలో బాలకృష్ణకు ఎదురీత తప్పదా?

ఎన్నికల వేళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీటుగా మారింది. హిందూపురం నుంచి ఎవరు విజేతగా నిలుస్తారన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గత నలభై సంవత్సరాలుగా టీడీపీ అభ్యర్థులే ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ సాధిస్తానంటున్నారు. అయితే ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోని బాలకృష్ణకు హిందూపురం ఓటర్లు గట్టిగానే గుణపాఠం చెప్పారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే సినీ హీరో బాలయ్య హిందూపురంలో ఎదురీదుతున్నట్లు జోరుగా చర్చ జరుగుతోంది.శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. హిందూపురం నియోజకవర్గంలో మొత్తం 2,49,174 మంది ఓటర్లు ఉండగా. 77.82 శాతం ఓటింగ్ నమోదైంది. 2014, 2019 ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి స్వల్పంగా పోలింగ్ శాతం పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టీఎన్‌ దీపిక పోటీ చేయగా..ఎన్‌డీఏ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా ముచ్చటగా మూడోసారి నందమూరి బాలకృష్ణ బరిలో నిలిచారు. నందమూరి కుటుంబానికి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గానికి పేరుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు 1985 నుంచి వరుసగా మూడు సార్లు, ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ 1996లో జరిగిన ఉప ఎన్నికలో ఒకసారి హిందూపురం నుంచే గెలిచారు.2014, 2019 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే మా బ్లడ్ వేరు..మా బ్రీడ్‌ వేరు అంటూ డప్పు కొట్టుకునే బాలకృష్ణకు బీసీ మహిళ అయిన కురుబ దీపిక చుక్కలు చూపించారు. నియోజకవర్గం అంతటా ఇంటింటా ప్రచారం నిర్వహించి వైఎస్ జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లారు. తాను హిందూపురం కోడలినని.. తనకు ఓటు వేస్తే హిందూపురంలోనే ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఆమె భరోసా ఇచ్చారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తున్నారు. తనను రెండుసార్లు అసెంబ్లీకి పంపించిన హిందూపురం ప్రజల బాగోగులను ఆయన ఏనాడూ పట్టించుకోలేదు.తాను హైదరాబాద్‌లో సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూ..హిందూపురంలో తన తరపున పీఏలను ఏర్పాటు చేసి ప్రజాగ్రహానికి గురయ్యారు బాలకృష్ణ. అందుకే ఈ ఎన్నికల్లో బాలకృష్ణకు బుద్ధి చెప్పేందుకు ఓటర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో బాలకృష్ణకు వ్యతిరేక పవనాలు బలంగా వీచినట్లు చర్చ జరుగుతోంది. హిందూపురం పట్టణంలో ముస్లిం మైనార్టీలు పెద్దసంఖ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓట్లు వేసినట్లు స్పష్టం అవుతోంది. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందో అని సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ టెన్షన్ కు గురవుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీంతో ఖచ్చితంగా హిందూపురంలోనూ జెండా ఎగురవేస్తామన్న ధీమాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.మూడోసారి గెలవాలనే లక్ష్యంతో నందమూరి బాలకృష్ణ ఆపసోపాలు పడ్డారు. పదేళ్ళ పాటు ఎమ్మెల్యేగా ఉండి..నియోజకవర్గం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి..ఇప్పుడు తనను ఈసారి గెలిపిస్తే ప్రజలకు మేలు చేస్తానంటూ చెప్పిన కబుర్లు ప్రజలు విశ్వసించలేదు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీయే విశ్వసనీయత కోల్పోగా..ఆయన బావమరిదిగా బాలకృష్ణ కూడా అదే బాటులో పయనించి ప్రజలకు దూరమయ్యారు. అందుకే ఈసారి హిందూపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగిందని చెబుతున్నారు.

ICC Men T20 World Cup 2024 Groups All Squads Full Details
T20 WC 2024: ఇరవై జట్లు.. ఆటగాళ్ల లిస్టు.. పూర్తి వివరాలు

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి నేతృత్వంలో 2007లో మొదలైన టీ20 ప్రపంచకప్‌ టోర్నీ విజయవంతంగా ఎనిమిది ఎడిషన్లు పూర్తి చేసుకుంది. అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా జూన్‌ 1 నుంచి తొమ్మిదో ఎడిషన్‌ మొదలుకానుంది.ఈ మెగా ఈవెంట్‌ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఇద్దరంటే ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే కొనసాగుతున్నారు. టీమిండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ, బంగ్లాదేశ్‌ మాజీ సారథి షకీబ్‌ అల్‌ హసన్‌కు మాత్రమే ఈ అరుదైన ఘనత సాధ్యమైంది.పటిష్ట భారత జట్టును మరోసారి పొట్టి ప్రపంచకప్‌ టోర్నీలో ముందుకు నడిపించే క్రమంలో రోహిత్‌ నాయకుడిగా బరిలో దిగనుండగా.. నజ్ముల్‌ షాంటో సారథ్యంలో షకీబ్‌ ఆల్‌రౌండర్‌గా వరల్డ్‌కప్‌లో భాగం కానున్నాడు.ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 20 జట్లు ఈ ఐసీసీ టోర్నమెంట్లో పాల్గొననున్నాయి. నాలుగు గ్రూపులుగా వీటిని విభజించారు. మరి 20 జట్లలో భాగమైన ఆటగాళ్లు ఎవరో చూద్దామా?👉గ్రూప్‌- ఏ: ఇండియా, పాకిస్తాన్‌, యూఎస్‌ఏ, ఐర్లాండ్‌, కెనడా👉గ్రూప్‌- బి: ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్‌, ఒమన్‌👉గ్రూప్‌- సి: వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, అఫ్గనిస్తాన్‌, ఉగాండా, పపువా న్యూగినియా👉గ్రూప్‌- డి: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌, నేపాల్‌.ఇండియారోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అర్ష్‌దీప్‌ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్.. రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్.పాకిస్తాన్‌బాబర్ ఆజం(కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.యునైటెడ్‌ స్టేట్స్‌మోనాక్‌ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరె అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసార్గ్ పటేల్, నితీష్ కుమార్, నౌష్టుష్ కెంజిగే, సౌరభ్ నెత్రాల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్విక్, స్టీవెన్ టేలర్, షయాన్ జహంగీర్. రిజర్వ్ ప్లేయర్లు: గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్డేల్, యాసిర్ మొహమ్మద్.ఐర్లాండ్‌పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బాల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెకార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్.కెనడాసాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్‌పాల్‌ సింగ్, నవనీత్ ధాలివాల్, కలీమ్ సనా, దిలోన్ హెయిలీగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రేయాన్‌ ఖాన్‌ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వా, రిషివ్ జోషి.రిజర్వ్‌ ప్లేయర్లు: తజిందర్ సింగ్, ఆదిత్య వరదరాజన్, అమ్మర్ ఖలీద్, జతిందర్ మథారు, పర్వీన్ కుమార్.ఇంగ్లండ్‌జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్‌, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.ఆస్ట్రేలియామిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్‌, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా. ట్రావెలింగ్ రిజర్వ్స్: జేక్ ఫ్రేజర్-మెగర్క్‌, మాట్ షార్ట్.నమీబియాగెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచర్, రూబెన్ ట్రంపెల్మాన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, టాంగెని లుంగామెని, నికో డావిన్, జేజే స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కోట్జ్, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రూగర్, పీడీ బ్లిగ్నాట్.స్కాట్లాండ్‌రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలీ హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్ ముల్లెన్, జార్జ్ మున్సే, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోల్, చార్లీ టియర్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్.ఒమన్‌అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషాన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్, ఖలీద్ కైల్. రిజర్వు ప్లేయర్లు: జతిందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జయ్ ఓదెరా.వెస్టిండీస్‌రోవ్‌మన్‌ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయిర్, షాయీ హోప్, అకీల్ హొసేన్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్‌, రొమారియో షెపర్డ్, ఒబెడ్‌ మెకాయ్‌.న్యూజిలాండ్‌కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రాస్‌వెల్‌, మార్క్ చాప్‌మన్‌, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, ఇష్ సోధీ, టిమ్ సౌథీట్రావెలింగ్ రిజర్వ్: బెన్ సియర్స్.అఫ్గనిస్తాన్‌రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోతి, ముజీబ్ యువర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్‌ ప్లేయర్లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం సఫీ.ఉగాండాబ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ సెసాజీ, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ స్సెన్యోండో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఓబుయా, రియాజత్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్. ట్రావెలింగ్ రిజర్వ్స్: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా.పపువా న్యూగినియాఅస్సాడోల్లా వాలా (కెప్టెన్), అలీ నావో, చాడ్ సోపర్, సీజే అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కామియా, సెసే బావు, టోనీ ఉరా.సౌతాఫ్రికా ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నియల్ బార్ట్మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డికాక్, జోర్న్ ఫార్చ్యూన్‌, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నోర్జే, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షంసీ, ట్రిస్టన్ స్టబ్స్.శ్రీలంకవనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక, కుశాల్ మెండిస్, పథుమ్ నిస్సాంకా, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహీష్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీషా పతిరణ, దిల్షాన్ మదుశంక. ట్రావెలింగ్ రిజర్వ్స్: అసితా ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్స, జనిత్ లియానాగే.బంగ్లాదేశ్‌నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), టస్కిన్ అహ్మద్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహీద్‌ హ్రిదోయ్, మహ్మద్ ఉల్లా రియాద్, జకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షేక్ మహేది హసన్, రిషద్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం, తాంజీమ్ హసన్ సకీబ్. ట్రావెలింగ్ రిజర్వ్స్: అఫిఫ్ హుస్సేన్, హసన్ మహమూద్.నెదర్లాండ్స్‌స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లెయిన్, లోగాన్ వాన్ బీక్, మ్యాక్స్ ఓ డౌడ్, మైఖేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లెయిన్, సాకిబ్ జుల్ఫికర్, సిబ్రాండ్ ఎంగెల్బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బారేసి. ట్రావెలింగ్ రిజర్వ్: ర్యాన్ క్లెయిన్నేపాల్‌రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సాహ్, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్బన్షి, కరణ్ కేసీ, గుల్షన్ ఝా, సోంపాల్ కామి, ప్రతిస్ జీసీ, సందీప్ జోరా, అవినాష్ బోహరా, సాగర్ ధాకల్, కమల్ సింగ్ ఐరీ.చదవండి: T20 WC: మొత్తం షెడ్యూల్‌, సమయం, లైవ్‌ స్ట్రీమింగ్‌.. పూర్తి వివరాలుT20 WC 2024: టీమిండియాతో పాటు ఏయే జట్లు? రూల్స్‌ ఏంటి?.. వివరాలు

Air India Gets Ministry Notice Over 20-Hour Flight Delay
Air India: 20 గంటలు ఆలస్యం.. కేంద్ర మంత్రిత్వశాఖ నోటీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ ఇండియా విమానం గంటల తరబడి ఆలస్యం కావడంపై కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిన విమానం దాదాపు 20 గంటలు ఆలస్యంగా కారణంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. గంటల తరబడి విమానంలోనే కూర్చోవాల్సి రావడం, ఏసీ కూడా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. కొన్ని అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. అయితే అసలే 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఢిల్లీలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చర్యట్లు ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలని కేంద్రమంత్రిత్వశాఖ విమానయాన సంస్థను కోరింది.కాగాఎయిరిండియా కు చెందిన బోయింగ్‌ 777 విమానం 200 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు దిల్లీ నుంచి అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బయల్దేరాలి.. కానీ దాదాపు ఆరు గంటలు ఆలస్యమైంది. రాత్రి 8 గంటలకు రీ షెడ్యూల్‌ చేశారు. సాంకేతిక సమస్యలతో విమానం మార్చారు. దీంతో ప్రయాణికులు రాత్రి 7.20 గంటలకు మరో విమానంలో బోర్డింగ్‌ అయ్యారు. అనంతరం విమానం మళ్లీ ఆలస్యమని ప్రకటన చేశారు.అయితే అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్‌ పూర్తవ్వగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు.న్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. దీనికితోడు ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. తిరిగి విమానాశ్రయానికి వెళ్లేందుకు గేట్లు కూడా తెరవకపోవడంతో ప్రయాణికులు దాదాపు గంటపాటు ఏరోబ్రిడ్జిలో వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో వృద్ధులు, పిల్లలు, మహిళలు కూడా ఉన్నారు.

Today Gold and Silver Price 31 May 2024
స్థిరంగా బంగారం.. తగ్గిన వెండి: ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ఎట్టకేలకు స్థిరంగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజు (మే 31) పసిడి ధరల్లో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.66700 (22 క్యారెట్స్), రూ.72760 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరల్లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కాబట్టి నిన్నటి ధరలే ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి.ఈ రోజు చెన్నైలో కూడా బంగారం ధరల్లో ఎటువంటి మార్పు కనిపించలేదు. కాబట్టి 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 67300 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 73420 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే.. నిన్నటి ధరలే ఈ రోజూ ఉన్నట్లు సమిష్టమవుతుంది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా నేడు బంగారం ధరలు ఎటువంటి మార్పు చెందలేదు. నిన్నటి ధరలే ఈ రోజు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నేడు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 66850, కాగా 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72910గా ఉంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. కాబట్టి కేజీ వెండి ధర రూ. 95500 వద్ద ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా వెండి ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. కానీ వెండి ధర త్వరలోనే రూ. 1 లక్షకు చేరువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Kejriwal Appeals for Public Support for his family He Returns to Jail
ఎల్లుండి లొంగిపోతున్నా.. మీరంతా జాగ్రత్త: సీఎం కేజ్రీవాల్‌

ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంత బెయిల్‌ గడువు ఎల్లుండి (ఆదివారం)తో ముగుస్తుంది. ఆరోజే కేజ్రీవాల్‌ తిరిగి తీహార్ జైలులో లొంగిపోనున్నారు.సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రజలకు తెలియజేశారు.ఈ క్రమంలో తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొగసాగుతుందని కేజ్రీవాల్ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘ లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21 రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనియకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారు. నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు.मुझे परसों सरेंडर करना है। माननीय सुप्रीम कोर्ट का बहुत-बहुत शुक्रिया। https://t.co/1uaCMKWFhV— Arvind Kejriwal (@ArvindKejriwal) May 31, 2024 నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నా. రోజు నా పొట్ట భాగంలో 4 సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరంలో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు. పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్‌లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు. నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటళ్లలో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు రూ. వెయ్యి ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రుల కోసం దేవుడిని ప్రార్ధించండి. వారి ఆరోగ్యం బాగాలేదు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలి ’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.

SIT issues notice to Bhavani Revanna over Molestation Abuse accused Prajwal
కర్ణాటకలో కొత్త ట్విస్ట్‌.. ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణకు సిట్‌ నోటీసులు

బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపులు, దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ తల్లికి ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణను విచారించేందుకు శుక్రవారం ఐపీసీ సెక్షన్లు 64(A), 365, 109, 120(B) కింద సిట్‌ నోటీసులు ఇచ్చింది. తమ విచారణ కోసం భావానీ రేవణ్ణ హోలెనర్సీపూర్‌లోని వారి నివాసంలోనే జూన్‌ 1న సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో సిట్‌ పేర్కొంది. #BreakingS.I.T issues another notice to #PrajwalRevanna's mother #BhavaniRevanna in the kidnapping case.Prajwal Revanna will shortly be taken for a medical examination, and after that, he will be brought to the City Civil Court Complex for further questioning...: @dpkBopanna… pic.twitter.com/G9croxFBP6— TIMES NOW (@TimesNow) May 31, 2024 ఇక.. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీ నుంచి భారత్‌కు వచ్చిన ప్రజ్వల్‌ రేవణ్ణను సిట్‌ పోలీసులు బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఇక.. అక్కడి నుంచి ఆయన్ను విచారణ కోసం సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. విచారణలో భాగంగా ప్రజ్వల్‌కు పొటెన్సీ పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

'Gangs Of Godavari' Movie Review And Rating In Telugu
గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి మూవీ రివ్యూ

టైటిల్‌: గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరినటీనటులు: విశ్వక్‌ సేన్‌, అంజలి, నేహా శెట్టి, నాజర్‌, హైపర్‌ ఆది తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకుడు: కృష్ణ చైతన్యసంగీతం: యువన్‌ శంకర్‌ రాజాసినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి విడుదల తేది: మే 31, 2024మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల గామి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రయోగాత్మకంగా చేసిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇప్పుడు మరో డిఫరెంట్‌ మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేశాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గట్టిగా చేయడంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పలుమార్లు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. ఎట్టకేలకు నేడు(మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా కథంతా 90లో సాగుతుంది. గోదావరి జిల్లాలోని లంక గ్రామానికి చెందిన రత్నాకర్‌ అలియాస్‌ రత్న(విశ్వక్‌ సేన్‌) అనాథ. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు. అదే గ్రామంలో ఉండే వేశ్య రత్నమాల(అంజలి) అతనికి మంచి స్నేహితురాలు. తన చుట్టూ ఉన్నవారిని వాడుకుంటూ ఎదగాలనుకునే స్వభావం ఉన్న రత్నాకర్‌కు ఆ ఏరియాలో సాగుతున్న ఇసుక మాఫియా గురించి తెలుస్తుంది. దాని వెనుక స్థానిక ఎమ్మెల్యే దొరస్వామి రాజు(గోపరాజు రమణ) ఉన్నారని తెలుసుకొని అతనికి దగ్గరవుతాడు. కొద్ది రోజుల్లోనే దొరస్వామి కుడిభుజంలా మారతాడు. దొరస్వామి రాజకీయ ప్రత్యర్థి నానాజీ(నాజర్‌) కూతురు బుజ్జి(నేహా శెట్టి) ప్రేమలో పడి ఆమె కోసం నానాజీకి దగ్గరవుతాడు. ఇలా ఇద్దరి రాజకీయ నాయకులను వాడుకొని రత్నాకర్‌ ఎమ్మెల్యే అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తనను నమ్మించి మోసం చేసిన రత్నాకర్‌పై దొరస్వామి ఎలా పగ తీర్చుకున్నాడు? పిల్లను ఇచ్చిన మామ నానాజీని రత్నాకర్‌ ఎందుకు చంపాల్సి వచ్చింది? సొంత భర్తే తన తండ్రిని చంపాడని తెలిసిన తర్వాత బుజ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రత్నాకర్‌ ఎదుగుదలకు కారణమైన సొంత మనుషులే అతన్ని చంపేందుకు ఎందుకు కత్తి కట్టారు?(లంకలో ఎవరినైనా చంపాలని ఫిక్స్‌ అయితే ఆ ఊరి గుహలో ఉన్న అమ్మవారికి మొక్కి చంపాల్సిన వ్యక్తి పేరు అక్కడ రాస్తారు. దాన్నే కత్తి కట్టడం అంటారు) సొంత మనుషులే తనపై కత్తి కట్టారని తెలిసిన తర్వాత రత్నాకర్‌ ఏం చేశాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్‌ రాజకీయాల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. గోదావరి ప్రాంతానికి చెందిన ఒక స్లమ్ కుర్రాడు.. రాజకీయాలను వాడుకొని ఎలా ఎదిగాడు? ఎదిగిన తర్వాత అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేదే ఈ సినిమా కథ. దర్శకుడు ఎంచుకున్న కథ పాతదే అయినా.. దాన్ని తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. గత సినిమాల్లో గోదావరి అంటే కొబ్బరి చెట్లు చూపించి, అంతా ప్రశాంతంగా ఉన్నట్లు చూపించేవారు. కానీ ఈ సినిమాలో గోదావరిలో ఉండే మరో కోణాన్ని చూపించారు. విలేజ్‌ రాజకీయాలు ఎలా ఉంటాయి? నా అనుకునే వాళ్లే ఎలా వెన్నుపోటు పొడుస్తారు? తదితర విషయాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే రియలిస్టిక్‌ పేరుతో హింసను ఎక్కువగా చూపించడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే సినిమా కథంతా వాస్తవికానికి దూరంగా సాగినట్లు అనిపిస్తుంది. హీరో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తీరు సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అలాగే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా రౌడీలా ప్రవర్తించడం.. ప్రత్యర్థుల దాడి.. హీరోయిన్‌తో ప్రేమలో పడడం.. ఇవన్నీ ఆసక్తికరంగా సాగవు. కత్తికట్టడం గురించి చెబుతూ కథను ఆసక్తికరంగా ప్రారంభించాడు దర్శకుడు. ఎంట్రీ సీన్‌తో హీరో క్యారెక్టర్‌ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరో ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరకు వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కథ పరంగా కాదు కానీ హీరో ఎదిగిన తీరు మాత్రం పుష్ప సినిమాను గుర్తు చేస్తుంది. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్‌ రొటీన్‌గానే ఉంటుంది.ఎవరెలా చేశారంటే.. రత్న అలియాస్‌ రత్నాకర్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ ఒదిగిపోయాడు. గత సినిమాలతో పోలిస్తే భిన్నమైన పాత్ర తనది. యాక్షన్‌ సీన్లలో అదరగొట్టేశాడు. గోదావరి యాస మాట్లాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ ఆయన ఒరిజినల్‌ (తెలంగాణ) యాస బయటకు వచ్చింది. రత్నమాల అనే పవర్‌ఫుల్‌ పాత్రలో అంజలి చక్కగా నటించింది.బుజ్జిగా నేహాశెట్టి తెరపై అందాలను ప్రదర్శిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. ఐటమ్‌ సాంగ్‌లో ఆయేషా ఖాన్‌ అందాలతో ఆకట్టుకుంది. విలన్‌గా యాదు పాత్రలో గగన్ విహారి ఆకట్టుకున్నాడు. నాజర్‌, సాయి కుమార్‌ హైపర్‌ ఆదితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికత పరంగా సినిమా చాలా బాగుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్‌ అయింది. పాటలతో పాటు అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్‌

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement