Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

ICC T20 World Cup Trophy  To Sakshi
‘సాక్షి’కి టీ 20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ

మరికొద్ది రోజుల్లో టీ20 వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి ఐసీసీ టీ20 మెన్స్‌ ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్‌ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్‌ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 55 టీ20 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.‘సాక్షి’కి రానున్న వరల్డ్‌కప్‌ ట్రోఫీఇదిలా ఉంచితే, టీ20 వరల్డ్‌కప్‌ ట్రోఫీ నేడు ఆదివారం(మే 19) ‘సాక్షి’ ఆఫీస్‌కు రానుంది. ప్రొటెక్టెడ్‌ కంటైనర్‌లో సాక్షి ఆఫీస్‌కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్‌కు తీసుకువచ్చి అక్కడ పని చేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు.ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ పీయూష్‌ చావ్లా కూడా సాక్షి ఆఫీస్‌కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగస్తులతో పీయూష్‌ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్‌ స్పోర్ట్స్‌ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్‌కు విచ్చేయనుంది.కాగా జూన్‌ 5న ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా ఈ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ఆరంభించనుంది. భారత్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌ జూన్‌ 9న జరుగనుంది. తొలిసారి ఉగాండ..టోర్నీలో భాగంగా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం టీ 20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా అండ్‌ బర్బుడా, బార్బడోస్‌, డొమినికా, గయానా,సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ నగరాల్లో .. యూఎస్‌ఏలోని డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.ఈ ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి. వీటిల్లో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా, నేపాల్‌, ఓమన్‌, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి.

Fifth Phase Election Famous Candidates
రేపే లోక్‌సభ ఐదో దశ పోలింగ్‌.. అందరి చూపు వీళ్లపైనే!

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐదో దశ పోలింగ్‌ మే 20న జరగనుంది. ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలలో ఓటింగ్‌ జరగనుంది. పలువురు ప్రముఖులు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూపీలోని లక్నో లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అతనిపై సమాజ్‌వాదీ పార్టీ రవిదాస్ మెహ్రోత్రాను తమ అభ్యర్థిగా నిలబెట్టింది. మంత్రిగా పనిచేసిన మెహ్రోత్రా ప్రస్తుతం లక్నో సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి చెందిన ఎమ్మెల్యేగా ఉన్నారు.రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి దినేష్ ప్రతాప్ సింగ్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం తన సీటును వదులుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని అమేథీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఇక్కడి నుంచి గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కేఎల్ శర్మను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నిలబెట్టింది.చిరాగ్ పాశ్వాన్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన ఎన్డీఏ కూటమిలోని ఎల్‌జేపీ (ఆర్‌)కి చెందిన నేత. కాగా ఇదే స్థానం నుంచి శివచంద్ర రామ్‌ను ఆర్జేడీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దించింది.ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్‌లోని బారాముల్లా స్థానం నుంచి జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. ఒమర్‌పై మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ నుంచి ఫయాజ్ అహ్మద్ పోటీకి దిగారు. గత ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి అక్బర్ లోన్ ఈ స్థానంలో విజయం సాధించారు.ఐదో దశ ఎన్నికల పోరులో మోదీ ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు రంగంలోకి దిగారు. ముంబై నార్త్ నుండి పీయూష్ గోయల్, మోహన్‌లాల్‌గంజ్ నుండి కౌశల్ కిషోర్, లక్నో నుండి రాజ్‌నాథ్ సింగ్, అమేథీ నుండి స్మృతి ఇరానీ, ఫతేపూర్ నుండి సాధ్వి నిరంజన్ జ్యోతి, దిండోరి నుండి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, కోడెర్మా నుండి అన్నపూర్ణా దేవి, భివాండి నుండి కపిల్ పాటిల్ ఈ జాబితాలో ఉన్నారు.

AP Elections 2024: May 19th Political Updates In Telugu
May 19th: ఏపీ పొలిటికల్‌​ అప్‌డేట్స్‌

May 19th AP Elections 2024 News Political Updates7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్‌మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్‌గేట్‌ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్‌సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్‌సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం

Naturals Ice Cream Founder Raghunandan Srinivas Kamath passes away
‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ కన్నుమూత

దేశంలోని అగ్రశ్రేణి ఐస్ క్రీమ్ బ్రాండ్లలో ఒకటైన నేచురల్స్ ఐస్ క్రీమ్ వ్యవస్థాపకుడు రఘునందన్ శ్రీనివాస్ కామత్ కన్నుమూశారు. 70 ఏళ్ల వయసులో శుక్రవారం సాయంత్రం ముంబైలోని హెచ్‌ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లో ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ తుది శ్వాస విడిచారు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. చాలా సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు పడి దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకదానిని నిర్మించారు. కర్ణాటకలోని మంగళూరు తాలూకాలో ముల్కి అనే పట్టణంలో తన కెరీర్‌ను ప్రారంభించిన కామత్, నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ను స్థాపించి ‘ఐస్‌క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధి చెందారు. నేడు దీని విలువ సుమారు రూ. 400 కోట్లు.రఘునందన్ శ్రీనివాస్ కామత్‌ తండ్రి పండ్ల వ్యాపారి. చిన్నతనంలో పండ్ల వ్యాపారంలో తన తండ్రికి సహాయం చేసేవాడు. అలా పండ్ల గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని పెంచుకున్న కామత్‌ 14 సంవత్సరాల వయస్సులో తన గ్రామాన్ని విడిచి ముంబైకి పయనమయ్యాడు. 1984లో కేవలం నలుగురు సిబ్బంది, కొన్ని ప్రాథమిక పదార్థాలతో ఐస్ క్రీం వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా నేచురల్స్ ఐస్‌క్రీమ్‌ పుట్టింది.

Sakshi Editorial On female awareness in AP Assembly elections Polling
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!

ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్‌డీఎస్‌ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్‌ పోల్‌ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్‌డీఎస్‌ తెలిపింది. ఉజ్వల్‌ యోజన, స్వచ్ఛ భారత్‌ అభియాన్, జన్‌ధన్‌ యోజన, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్‌డీఎస్‌ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్‌ జగన్‌ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్‌ ఛేంజర్స్‌.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్‌ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్‌ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్‌బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్‌ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్‌ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్‌ పోల్స్‌ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్‌ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్‌’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్‌ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్‌ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్‌ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్‌ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్‌ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్‌ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్‌ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్‌ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్‌ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Weekly Horoscope Telugu 19-05-2024 To 25-05-2024
Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు

మేషంసన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా, సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. సేవాభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. వివాహ, ఉద్యోగాయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు అందవచ్చు. వారం చివరిలో కుటుంబసమస్యలు. నిర్ణయాలలో మార్పులు. అనారోగ్యం. గులాబీ, పసుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.వృషభంకొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువులను కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రులను ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. దుర్గాస్తోత్రాలు పఠించండి.మిథునంముఖ్య పనులు విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు కొన్ని దక్కే సూచనలు. వారం ప్రారంభంలో బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. గులాబీ, పసుపు రంగులు. శివాష్టకం పఠించండి.కర్కాటకంచిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.సింహంముఖ్య పనులు కొన్ని వాయిదా వేస్తారు. బంధువులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలు వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. ఒక సమాచారం కొంత నిరాశపరుస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. కళారంగం వారికి చికాకులు తప్పవు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఉద్యోగలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.కన్యఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. కుటుంబసమస్యలు క్రమేపీ తీరతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధననష్టం. బంధువిరోధాలు. అనారోగ్యం. గణపతి స్తోత్రాలు పఠించండి.తులముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. స్వల్ప అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.వృశ్చికంఅనుకున్న పనులు జాప్యం లేకుండా పూర్తి చేస్తారు. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంటాబయటా ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.ధనుస్సుకొన్ని నిర్ణయాలు మిత్రులను ఆశ్చర్యపరుస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. విద్యార్థుల యత్నాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు. కళారంగం వారికి నిరీక్షణ ఫలిస్తుంది. వారం చివరిలో బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఎరుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.మకరంమీ ఊహలు నిజం చేసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్య పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు, వివాదాలు సర్దుమణుగుతాయి. పారిశ్రామికవర్గాలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో బంధువులతో విభేదాలు. ధనవ్యయం. ఒత్తిడులు. పసుపు, బంగారు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.కుంభంఆర్థికంగా బలం చేకూరి అవసరాలు తీరతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.మీనంచేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజసేవలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహనయోగం. వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. సోదరులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకోని విధంగా లాభాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

పోలీసుల అదుపులో లోకేశ్‌బాబు
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర

విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్‌ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసు­కోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతి­పరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్‌ ఉయ్యూరు లోకేశ్‌­బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్‌ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ పార్కింగ్‌ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్‌ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్‌ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్‌ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్‌పోర్ట్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వా­య్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్‌ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతి­నిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్‌ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్‌ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్‌ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయ­వాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.

TDP Leader Chintamaneni Prabhakar escaped
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పరారీలో ఉన్నారు. పోలింగ్‌ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్‌ బూత్‌ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్‌ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్‌ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్‌ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్‌ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్‌ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.

Anushka Shetty Marriage With Kannada Producer Latest
హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?

అందం, అభినయం.. ఇలా రెండింటిలోనూ కేక పుట్టించే టాలెంట్ ఉన్న బ్యూటీ అనుష్క శెట్టి. గతంలో ఆమె నటించిన సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ప్రస్తుతం ఈమె చాలావరకు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన అనుష్క.. 40 ఏళ్లు దాటినా సరే ఇప్పటికే సింగిలే. ఈ క్రమంలో చాలాసార్లు పెళ్లి రూమర్స్ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం ఏకంగా ఓ నిర్మాతతో ఏడడుగులు వేయబోతుందని అంటున్నారు. ఇందులో నిజమెంత?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?)'బాహుబలి'తో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క.. ఈ మూవీ చేస్తున్న టైంలోనే 'సైజ్ జీరో'లో నటించింది. ఇందులో పాత్ర కోసం భారీగా బరువు పెరిగింది. ఆమె జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఇదే. సినిమా హిట్ అవ్వలేదు. అప్పటి నుంచి అనుష్క కూడా బరువు తగ్గట్లేదు. దీంతో చాలావరకు అవకాశాలు తగ్గిపోయాయి. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం మలయాళం ఓ మూవీ చేస్తోంది.హీరోయిన్లలో అనుష్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని చెప్పొచ్చు. ఈమె వయసు ఇప్పుడు 42 ఏళ్లు. ఈమె-ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు పుకార్లు వచ్చాయి. తాము మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి ఇద్దరూ క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ దర్శకుడితోనూ పెళ్లంటూ గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ అది అబద్ధమని తేలింది. ఇప్పుడు అలా మరోసారి టాక్ మొదలైంది. అనుష్క త్వరలో పెళ్లికి రెడీ అయిందని, కన్నడ నిర్మాతతో ఏడడుగులు వేయనుందని అంటున్నారు. ఇది కూడా కేవలం ఓ రూమర్‌లానే అనిపిస్తుంది. కొన్నిరోజులాగితే నిజమేంటనేది తెలిసిపోతుంది.(ఇదీ చదవండి: మళ్లీ ట్విట్టర్‌లోకి నాగబాబు.. వివాదాస్పద ట్వీట్‌ తొలగింపు)

మాచవరం పోలీస్‌ స్టేషన్‌ వద్ద మాట్లాడుతున్న కొత్త గణేశునిపాడు గ్రామస్తులు
దాడిచేసింది వారు.. మాపై కేసులా?

మాచవరం: వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా వ్యవ­హరిం­చామన్న కోపంతో మా ఇళ్లపై దాడులు చేసి... బీభత్సం సృష్టించిన టీడీపీ వర్గీయులను వదిలేసి... బాధితులైన మాపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మాచవరం పోలీస్‌స్టేషన్‌ వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ... పోలింగ్‌ రోజున ఓట్లు వేసేందుకు వచ్చిన మమ్ములను అడ్డు­కు­న్నారనీ, ఇదేమని ప్రశ్నించిన వారిపై దూషణకు దిగి, పోలింగ్‌ అనంతరం మీ సంగతి చూస్తామంటూ బెదిరించారని చెప్పారు. ప్రణాళిక ప్రకారం ఇతర గ్రామాలకు చెందిన టీడీపీ రౌడీలను కార్లలో తీసుకువచ్చి మా ఇళ్లపై దాడులు చేసి, ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేస్తూ, ఇంట్లో ఉన్న మహిళ­లను దూషిçస్తూ, భౌతిక దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బైకులు, ఆటోలు, ఇతర వాహనాలను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారని, భయాందోళనతో మేమంతా పొలాల వెంట పరుగులు తీశామని, మహిళలు గంగమ్మగుడిలో తలదాచుకు­న్నారని చెప్పారు. అక్కడకు కూడా వెళ్లి గుడి గేటు తాళాలు బిగించి ఇబ్బందులు పెట్టారని, సుమారు నాలుగు గంటల పాటు టీడీపీ గూండాలు గ్రామంలో వీరంగం చేస్తుంటే ఒక్క పోలీస్‌ అధికారి కూడా గ్రామానికి రాలేదన్నారు. విష­యం తెలుసుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌­రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ బాధితులను పరామర్శించేందుకు గ్రామానికి మరు­నాడే చేరుకుని మహిళలను ఇళ్ల వద్దకు చేర్చి, విధ్వంసానికి గురైన ఇళ్లను, ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్న సమయంలో వారిపైనా దాడికి యత్నించారని చెప్పా­రు. రాళ్లతో దాడిచేసి, కార్లను సైతం పగలగొ­ట్టారని చెప్పారు. ఆ సమయంలో పో­లీ­సులు గాలిలోకి కాల్పులు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తాము భయంతో వేరే ఊళ్లో తలదాచుకుంటే తమపై కేసులు పెట్టడం దారుణమన్నారు.మాపై కేసులు పెట్టడం అన్యాయంగ్రామంలో టీడీపీ వాళ్లు సృష్టించిన బీభత్సానికి భయంతో గ్రామాన్ని విడిచి పొరు­గూరిలో బంధువుల ఇళ్ల వద్ద తలదాచుకున్నాం. భార్యాపి­ల్లలు ఇంటి వద్ద బిక్కుబిక్కుమంటూ గడు­పుతు­న్నారు. గ్రామంలో వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఊళ్లో లేని మాపై పోలీసులు కేసులు పెట్టడం అన్యాయం. – అంబటి వెంకటేశ్వర్లు వైఎస్సార్‌సీపీకి ఓటేశామనే మాపై కక్షవైఎస్సార్‌సీపీకి ఓటేశా­మని మాపై కక్ష పెంచుకు­న్నా­రు. బీసీలకు పార్టీ­లు ఎందుకు­రా అంటూ పలుసార్లు అవమా­నించారు. అయినా ఓర్చుకొని పార్టీకోసం నిలబడ్డాం. వారి దాడులతో ఊరు వదిలి వెళ్లి ఐదు రోజులైంది. మాపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు. – మేకల హనుమంతుపోలీసులు రక్షణ కల్పించాలిఎన్నికల రోజు టీడీపీ గూండాలు చేసిన దాడులకు భయపడి పారి­పోయాం. భార్యా పిల్లల­తో బంధువుల వద్ద తల­దాచు­కుంటున్నాం. టీడీపీ వాళ్లు దాడులు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇదేమి న్యాయం. గ్రామంలోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పోలీసులు రక్షణ కల్పించాలి. – బొంతా ప్రసాద్‌

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement