తమిళసినిమా: నటుడు అజిత్‌తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్‌లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తా జాగా అజర్బైజాన్లో షూటింగ్‌ను నిర్వహించారు. త దుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్‌లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూ డు గెటప్‌లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్‌కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్‌బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్‌కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
అజిత్‌తో టాలీవుడ్ చిన్నది?
Published Tue, Apr 23 2024 8:30 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట
ఇదేమి ఊచకోత.. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
బహిరంగ చర్చ.. మోదీ, రాహుల్ గాంధీలకు ఆహ్వానం
Curry Leaves : కరివేపాకుతో ఇన్ని ప్రయోజనాలా..?
చంద్రబాబుకి అభివృద్ధి కనిపించడం లేదా?: సజ్జల
‘లాపతా లేడీస్’ నటి సంచలనం ఏకంగా కోటి ఫాలోయర్లు (ఫొటోలు)
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)
జీవితాలు ఖరాబ్.. కూతుర్ని మర్చిపోయా: యాంకర్ రవి
ప్యాకేజ్డ్ స్నాక్స్, ఫిజీ డ్రింక్స్ తాగుతున్నారా!..వెలుగులోకి షాకింగ్ విషయాలు
తప్పక చదవండి
- కేజ్రీవాల్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్న ఈడీ
- వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
- టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement