Top Stories
ప్రధాన వార్తలు
టీడీపీ చీటింగ్: వందల మందికి జీతాలు ఎగ్గొట్టి..
హైదరాబాద్, సాక్షి: పచ్చ మూకల కుట్ర రాజకీయాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. సర్వే పేరుతో దొడ్డిదారిన తెలుగు దేశం పార్టీ చేసిన నిర్వాకం ఇది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ.. అదీ రాజధాని నగరంలో సర్వే కోసం యువతను రిక్రూట్ చేసుకుంది. మూడు నెలలపాటు గొడ్డు చాకిరీచేయించుకుని.. చివరకు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టింది. ఆగ్రహంతో బాధితులు విధ్వంసానికి దిగగా.. ఈ ఘటన బయటపడింది.నగరంలోని పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో టీడీపీ నేతలు కొందరు తమ బినామీ పేరిట ఓ అద్దె భవనం తీసుకున్నారు. అందులో invitcus pvt lmtd bpo పేరిట బీపీవో కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. టెలికాలర్స్ జాబ్స్ పేరిట కొందరు స్టూడెంట్స్‌ను నియమించుకున్నారు. అయితే బీపీవో ముసుగుతో.. గుట్టు చప్పుడు కాకుండా వాళ్లతో ఎన్నికల సర్వే పని చేయించారు వాళ్లు. తీరా ఎన్నికలయ్యాక వాళ్లకు జీతాలు ఎగ్గొట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు.రూ.13 వేలు ఇస్తామని చెప్పి.. రూ.3 వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో కొందరు యువకులు ఆ ఆఫీస్ వద్దకు చేరి ఆందోళన చేపట్టారు. ఇదేంటని? వాళ్లు నిలదీయడంతో.. టార్గెట్ పూర్తి చేయలేదని అవతలి నుంచి సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకులు.. ఆఫీస్‌ను ధ్వంసం చేసేందుకు యత్నించారు. గొడవలు జరుగుతున్నాయన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ గ్యాప్‌లోనే కంపెనీ నిర్వాహకులు పరారైనట్లు, బాధితుల తరఫున నిలదీయబోయిన మీడియాపైనా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం.టీడీపీ నేతల అండదండలతోనే ఈ కార్యాలయం నడుస్తోందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాదు.. కూకట్‌పల్లిలో సైతం invitcus pvt lmtd ఓ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి ఇదే మాదిరి అక్కడా కూడా ఎన్నికల సర్వే నిర్వహించినట్లు తేలింది. ఇంకోవైపు మైనర్లతో వెట్టి చాకిరీ పై విచారణ చేయాలనీ బాధితుల బంధువుల ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని పోలీసులు చెబుతున్నారు.
కేసు పెట్టుకోండి.. పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
హైదరాబాద్, సాక్షి: కుత్బుల్లాపూర్ పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి హల్ చల్ చేశారు. అయితే ఆ స్థలం తమదేనంటూ వీళ్లిద్దరినీ కొందరు అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. స్థానికంగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన బారికెడ్లను తొలగించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 15 మందితో మల్లారెడ్డి-రాజశేఖర్‌రెడ్డిలకు వాగ్వాదం చోటుచేసుకుంది.పరిస్థితి ఉద్రిక్తంగా మాకోరుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.పోలీసుల అదుపులో మల్లారెడ్డిసుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 భూవివాదం వ్యవహారంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ని పేట్‌బషీరాబాద్ పీఎస్‌కు తరలించారు.
May 18th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 18th AP Elections 2024 News Political Updates 12.00 PM, May 18th, 2024దూకుడు పెంచిన సిట్ఎన్నికల హింసపై సిట్ ముమ్మరంగా దర్యాప్తునిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్లాల్డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో భేటీ అయిన వినీత్ బ్రిజ్ లాల్వినీత్ బ్రిజ్ లాల్‌కు పొద్దున్నే రిపోర్ట్ చేసిన 13 మంది టీం13 మంది సిట్ సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన వినీత్ బ్రిజ్లాల్మూడు జిల్లాలకు మూడు బృందాలను నియమించిన వినీత్ బ్రిజ్ లాల్పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలో క్షేత్ర స్థాయి విచారణ జరపనున్న సిట్ టీమ్స్తాడిపత్రి, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, తిరుపతి ఘటనలపై సిట్ ఫోకస్హింసకు కారణమైన పోలీస్ అధికారుల పాత్రపై విచారించనున్న సిట్హింస ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న సిట్ 11.30 AM, May 18th, 2024తిరుపతిజగనన్న రెండోసారి సీఎం అవుతారు: మంత్రి ఆర్కే రోజాతాతయ్య గుంట గంగమ్మతల్లికి సారే సమర్పించిన మంత్రి ఆర్కే రోజాఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అన్న రెండోసారి ముఖ్యమంత్రి అవుతారుమళ్ళీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుంది 11.00 AM, May 18th, 2024మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా?: పోతిన వెంకట మహేష్స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా, కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్‌గా పెట్టించి సినిమా పూర్తికాకముందే రూ. 3 కోట్లు ఇప్పించి, మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్న "పుష్పా " 2019లో జనసేన పార్టీకి రూ. 2 కోట్లు ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నాడు.2009, 2019, 2024 అండగా నిలిచిన వారిపై, గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీని దగా ఫ్యామిలీ అనకుండా ఉండగలమా? 10.30 AM, May 18th, 2024చింతమనేని దౌర్జన్యంగా తీసుకెళ్లిన నిందితుడి అరెస్ట్పరారీలో టీడీపీ నేత ప్రభాకర్‌పోలింగ్ రోజు జరిగిన హత్యాయత్నం కేసులో రాజశేఖర్ నిందితుడుఅతన్ని పోలీసు స్టేషన్ నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లిన చింతమనేని 9.30 AM, May 18th, 2024నోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ?అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్నాగబాబు చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబునోరు జారనేల.. పారిపోవడమేల నాగబాబూ? అల్లు అర్జున్‌ని పరాయివాడు అంటూ ట్వీట్. @NagaBabuOffl చరిత్రని బయటికి తీసి ఉతికారేసిన @alluarjun ఫ్యాన్స్ దెబ్బకి ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేసి అవమానంతో పారిపోయిన నాగబాబు pic.twitter.com/YLsZNMFOiq— YSR Congress Party (@YSRCParty) May 18, 2024 9.00 AM, May 18th, 2024అల్లర్లకు అచ్చెన్న ఎత్తుగడపోర్టు వాహనాలతో రోడ్లు పాడైపోతున్నాయంటూ ఆందోళనకు కుట్ర పోలీసులకు ఫోన్ చేసి మరీ హెచ్చరించిన అచ్చెన్నముందస్తుగా భారీ ఎత్తున మోహరించిన పోలీసు బలగాలు8.30 AM, May 18th, 2024హైదరాబాద్‌లో బయటపడ్డ టీడీపీ మోసం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో లోని నాగార్జున సర్కిల్లో ఓ అదే భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతరేకంగా తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా బీపీఓ కాల్ సెంటర్ పేరుతో సర్వే చేపడ్తున ఓ ప్రైవేట్ యాజమాన్యంమైనర్ స్టూడెంట్స్ తో సర్వే పేరిట టెలి కాలింగ్ పదమూడు వేల వేతనం అని చెప్పి కేవలం రూ. 3000 మాత్రమే అంటగడుతున్న యాజమాన్యంగత మూడు నెలలుగా సర్వే నడుపుతున్న యాజమాన్యంరెండువందల మంది స్టూడెంట్స్ తో బీపీఓ కాల్ సెంటర్ ఎలక్షన్ అనంతరం టార్గెట్ పూర్తి చేయలేదని డబులు ఎగ్గొట్టే ప్రయత్నం క్రికెట్ వికెట్లతో వేతనం అందని స్టూడెంట్స్ ఫర్నీచర్ ధ్వంసం చేసే ప్రయత్నంమీడియాపై దురుసుగా ప్రవర్తిస్తూ కెమెరాను సైతం తోసేసిన వైనంటీడీపీకి చెందిన సర్వే కంపెనీ invitcus pvt lmtd bpo అరాచకంపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్రాత్రి కి రాత్రే పరారీఎన్నికల ముందు మూడు నెలల నుండి కార్యకలాపాలుకూకట్‌పల్లిలో సైతం ఒక బ్రాంచ్ ఏర్పాటు 7.45 AM, May 18th, 2024విజయవాడఎన్నికల హింసపై సిట్ దర్యాప్తు ప్రారంభంనిన్న రాత్రి నుంచే దర్యాప్తు ప్రారభించిన వినీత్ బ్రిజ్‌లాల్‌వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటుసిట్ బృందంలో 13 మంది అధికారులుఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్య లత నియామకంఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐడీ డీఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీ లు వి. శ్రీనివాసరావు, రవి మనోహర చారి నియామకంఇన్స్పెక్టర్లు భూషణం, వెంకట రావు, రామకృష్ణ, జీఐ శ్రీనివాస్, మెయిన్, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్ లు సిట్ సభ్యులుగా నియామకంపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసపై దర్యాప్తు చేస్తున్న సిట్ఎన్నికల అనంతర హింసలో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తురేపటిలోగా ఎన్నికల కమిషన్‌కి నివేదిక ఇవ్వనున్న సిట్ 7.30 AM, May 18th, 2024టీడీపీ దాష్టీకానికి పరాకాష్టకుట్ర రాజకీయానికి మహిళా వలంటీర్ బలివైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో ఫిర్యాదుఆగమేఘాలపై కేసు నమోదుపోలీసుల విచారణ.. ఆందోళనతో ఆగిన గుండె 7.00 AM, May 18th, 2024కూటమి రేపిన కలకలం...మైనార్టీల్లో కలవరం!2004లో ముస్లిములకు 4 శాతం రిజర్వేషన్లుడాక్టర్ వైఎస్సార్ కల్పించిన వరం...గత పదేళ్లలో ఆరువేలమందికిపైగా డాక్టర్లయిన ముస్లిం యువతవిద్యా ఉద్యోగాల్లో ముస్లిం యువత ముందడుగు..రిజర్వేషన్లను కొనసాగిస్తూ సీఎం వైఎస్ జగన్ మరింత ఊతంకూటమి విష ప్రచారానికి ముస్లిం సమాజం బెంబేలు.. 6.30 AM, May 18th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన.
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.
బీజేపీ భారీ ప్రయోగం.. ఫలించేనా?
న్యూఢిల్లీ, సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో హ్యట్రిక్ విక్టరీపై బీజేపీ కన్నేసింది. అయితే అది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు. దేశానికి గుండెకాయలాంటి రాజధాని ఢిల్లీలోనూ హ్యట్రిక్ క్లీన్ స్వీప్ కోసం ట్రై చేస్తోంది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లకు ఏడు సీట్లు కాషాయం పార్టీనే గెలుచుకుంది. అయితే.. ఈసారి ఇక్కడ బీజేపీ భారీ ప్రయోగానికే దిగింది. ఢిల్లీలో ఈనెల 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి పాత వాసనలు లేకుండానే ఎన్నికలకు వెళ్తోంది. మొత్తం ఏడు సీట్లలో.. ఆరుగురు సిట్టింగ్‌లను పక్కన పెట్టేసింది. నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి మనోజ్ తివారి మాత్రమే టికెట్ దక్కించుకోగలిగారు. బీజేపీ లీగల్ సెల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్న సుష్మాస్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్.. న్యూఢిల్లీ ఎంపీ సీటు నుంచి పోటీకి దిగారు. గతంలో సుష్మా స్వరాజ్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేయడం బన్సూరికి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. బస్సూరితో పాటు చాందిని చౌక్ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, ఈస్ట్ ఢిల్లీ నుంచి హర్ష మల్హోత్ర, నార్త్‌వెస్ట్ ఢిల్లీ నుంచి యోగేంద్ర చందోలియా, వెస్ట్ డిల్లీ నుంచి కమల్జీత్ సెహ్రవాత్, సౌత్ ఢిల్లీ నుంచి రాంవీర్ సింగ్ బిదూరి కొత్తగా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ➡️ అయితే.. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి గట్టి సవాలే ఎదురవుతోంది. గత రెండు ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీచేయడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారింది. కానీ ఈ సారి ఆప్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగింది. ఆప్ నాలుగు సీట్లలో, కాంగ్రెస్ మూడు సీట్లలో పోటీ చేస్తున్నాయి. దీంతో ఈసారి బీజేపీ విజయం కాస్త కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పైగా.. ➡️ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆప్ ప్రచారం చేస్తోంది. తద్వారా ప్రజల్లో కొంత సానుభూతిని రాబట్టాలని చూస్తోంది. ఈ ప్రయత్నాలను బీజేపీ ఎలా తిప్పికొడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈలోపే.. ➡️కేజ్రీవాల్ నివాసంలో ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై సీఎం వ్యక్తిగత అనుచరుడు దాడి చేసిన ఘటన జరిగింది. ఇది ఇప్పుడు బీజేపీకి రాజకీయ ప్రచార అస్త్రంగా మారింది. సీఎం ఇంట్లోనే మహిళలకు భద్రతలేదనే అంశాన్ని బీజేపీ ఎన్నికల అస్త్రంగా వాడుతోంది. అయితే బీజేపీ కేవలం ప్రత్యర్థులపై విమర్శలతోనే సరిపెట్టడం లేదు. ➡️నరేంద్ర మోదీ సారథ్యంలో గత ప్రభుత్వం పదేళ్ల సాధించిన విజయాలనూ ఢిల్లీలో బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్‌ను రాజధాని ప్రజల ముందు పెడుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ఢిల్లీలో అమలు చేయకుండా కేజ్రీవాల్ అడ్డుపడ్డారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. మినీ ఇండియా లాంటి ఢిల్లీలో నివసిస్తున్న ప్రజలలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అన్ని పార్టీల ప్రచారాలను గమనిస్తున్న ఓటరు ఎటు నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
నటుడు చందు ఆత్మహత్య.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య
'త్రినయని' సీరియల్ నటి పవిత్రా జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్నిరోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకొచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.(ఇదీ చదవండి: బుల్లితెర నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు చందు సూసైడ్!)'స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!)
ఆగ్రాలో మరో ‘వాహ్ తాజ్’.. పర్యాటకులు క్యూ
ఆగ్రా అనగానే అందరికీ ముందుగా తెల్లని పాలరాతి కట్టడం తాజ్ మహల్ గుర్తుకు వస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో తాజ్‌కు పోటీనిస్తూ, దానినే పోలిన మరో పాలరాతి భవనం ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇది ఆధ్యాత్మిక పర్యాటకులకు ఆలవాలంగా ఉంది.తాజ్ మహల్‌కు 12 కి.మీ. దూరంలోని స్వామి బాగ్ వద్ద రాధాస్వామి సత్సంగ్ శాఖ వ్యవస్థాపకుని సమాధి స్థలంలో నిర్మించిన అద్భుత భవనం మరో తాజ్‌గా పేరొందుతోంది. స్వచ్ఛమైన తెల్లని పాలరాయితో నిర్మితమైన ఈ భవనం పర్యాటకులను అమితంగా అలరిస్తోంది. దీనిని చూసిన పర్యాటకులు ఇది తాజ్‌మహల్‌కు పోటీ అని అభివర్ణిస్తున్నారు. మొఘలుల స్మారక కట్టడాలకు ప్రసిద్ధి చెందిన ఈ నగరంలో ఈ ‘తాజ్’ మరో ఆకర్షణగా నిలిచింది.రాజస్థాన్‌లోని మక్రానా నుండి తెచ్చిన తెల్లటి పాలరాయితో రూపొందిన ఈ 193 అడుగుల ఎత్తయిన ఈ నిర్మాణం భారతదేశ ఖ్యాతిని మరింతగా పెంచుతుందనడంలో సందేహం లేదు. రాధాస్వామి శాఖ వ్యవస్థాపకులు పరమ పురుష్ పూరన్ ధని స్వామీజీ సమాధి స్థలంలో ఈ భవనం నిర్మితమయ్యింది. ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఈ సమాధి స్థలిని సందర్శించేందుకు వస్తుంటారు. ఇక్కడి అద్భుత కళాకృతులను చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇక్కడ ఫోటోగ్రఫీని అనుమతించరు.రాధాస్వామి అనుచరుల కాలనీ మధ్య ఈ భవనం ఉంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, కర్ణాటక తదితర రాష్ట్రాలతో పాటు విదేశాలలో లక్షలాది మంది రాధాస్వామి అనుచరులు ఉన్నారు. 1904లో అలహాబాద్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్ చేతుల మీదుగా ఈ భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. భవనం కొంతమేరకు నిర్మాణం పూర్తయ్యాక ఆగిపోయింది. అయితే 1922లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఇక్కడ జరిగే పనులన్నీ హస్త కళాకారుల నైపుణ్యంతో కూడినవే కావడం విశేషం. పైగా వీరు మూడు తరాలుగా ఈ పనుల్లో నిమగ్నమవుతున్నారు. బంగారు పూతతో ఈ భవన శిఖరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ శిఖరం తాజ్‌మహల్ కన్నా పొడవైనది కావడం విశేషం.
ఒకే ప్లాన్‌తో టీవీ చానళ్లు, ఓటీటీ యాప్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఒకే ప్లాన్‌తో ఇటు టీవీ చానళ్లు, అటు ఓటీటీ యాప్స్‌ను కూడా పొందే విధంగా డిష్ టీవీ కొత్తగా స్మార్ట్‌ప్లస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ప్లాన్ కిందే వీటిని పొందవచ్చని సంస్థ సీఈవో మనోజ్ దోభల్ తెలిపారు.రూ. 200 ప్యాక్ నుంచి ఇది అందుబాటులో ఉంటుంది. పాత, కొత్త కస్టమర్లు.. స్మార్ట్‌ప్లస్ కింద సదరు ప్లాన్‌లోని టీవీ ఛానళ్లతో పాటు డిఫాల్టుగా లభించే హంగామా వంటి అయిదు ఓటీటీ యాప్‌లతో పాటు జీ5, డిస్నీప్లస్ హాట్‌స్టార్, సోనీ లివ్ తదితర యాప్‌ల నుంచి ఒకటి ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే మూడు రోజుల తర్వాత మరో యాప్‌నకు మారవచ్చు.పూర్తిగా 16 యాప్‌లు పొందాలంటే నెలకు రూ. 179 చార్జీ ఉంటుంది. కొత్త సర్వీసులతో మార్కెట్ వాటా 3–4 శాతం మేర పెంచుకోగలమని ఆశిస్తున్నట్లు మనోజ్ తెలిపారు. ప్రస్తుతం తమకు డీటీహెచ్ మార్కెట్లో 21 శాతం వాటా ఉందని వివరించారు. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో ఆండ్రాయిడ్ 4కే బాక్స్, క్లౌడ్ టీవీ వంటి ఉత్పత్తులు అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు.
తప్పక చదవండి
- ‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
- తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ విద్యార్థి సత్తా
- టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
- అనంతలో ఘోర ప్రమాదం: పెళ్లి షాపింగ్ చేసి తిరిగొస్తుండగా..
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- తిరుమల: నేడు ఆగష్టు ఆర్జితసేవా టికెట్ల విడుదల
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- చివరి బెర్త్ ఎవరిదో?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
సినిమా
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్‌లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్‌గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్‌తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్‌లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్)
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటుడు చందు బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్కాపూర్ కాలనీలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చందు ప్రస్తుతం త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్‌లో నటించారు. కాగా.. 2015లో శిల్పను ప్రేమ వివాహం చేసుకున్న చందుకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కాగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఆరేళ్లుగా చందుకు టీవీ నటి పవిత్ర జయరాంతో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని వెల్లడించారు. కాగా.. పవిత్రతో సహజీవనం చేసిన చందు ఆమెను గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు. ఈ నేపథ్యంలో చందు సూసైడ్ చేసుకోవడం ఒక్కసారిగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనతో సీరియల్ నటి పవిత్ర జయరాం యాక్సిడెంట్ కేసు కీలక మలుపులు తిరగనుంది.
కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
సింగర్ సుచిత్ర కోలీవుడ్ షేక్ చేస్తోంది. రోజుకొక బాంబు పేలుస్తోంది. గతంలో సుచీలీక్స్ పేరిట సంచలనం విషయాలు బయటపెట్టిన ఆమె మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖుల గురించి సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే తన మాజీ భర్త కార్తీక్ కుమార్, ధనుశ్, త్రిష, కమల్‌హాసన్‌ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. అయితే ఈ సారి బాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, నిర్మాత కరణ్ జోహార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. లండన్ ట్రిప్‌లో కార్తీక్ కుమార్, షారుక్, కరణ్ కలిసి గే పార్టీలకు వెళ్లారని ఆరోపించింది. ఎక్కడైతే స్వలింగ సంపర్కులకు చట్టబద్ధమైన అనుమతి ఉందో అలాంటి దేశాలకు వెళ్లేవారని తెలిపింది. దీంతో మరోసారి సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారాయి.*Big Allegations on Shahrukh Khan and Karan Johar*According to Tamil Singer Suchitra, her Ex husband Karthik Kumar, SRK and Karan Johar had a gay encounter in LondonThey Usually go the countries on holidays where GAY S*X is legal and they enjoy it 😵 pic.twitter.com/VYrYk8pUnz— Sunanda Roy 👑 (@SaffronSunanda) May 16, 2024
‘విద్య వాసుల అహం’ మూవీ రివ్యూ
టైటిల్: విద్య వాసుల అహంనటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మి తదితరులునిర్మాణ సంస్థ: ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: మహేష్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి దర్శకత్వం: మణికాంత్ గెల్లిసంగీతం: కళ్యాణి మాలిక్ఎడిటర్ : అఖిల్ వల్లూరిఓటీటీ స్ట్రీమింగ్ వేదిక: ఆహా(మే 17 నుంచి)ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. అలా ఈ వారం(మే 17) రిలీజ్ అయిన సినిమానే ‘విద్య వాసుల అహం’. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. దానికి తోడు థియేటర్ సినిమా మాదిరి ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘విద్య వాసుల అహం’ కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో రిలీజైన ఈ మూవీ ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వాసు(రాహుల్ విజయ్) ఓ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్‌గా పని చేస్తుంటాడు. పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్లు బలవంతం చేసినా..అతను మాత్రం ఇంట్రెస్ట్ చూపించడు. మరోవైపు విద్య(శివాని) కూడా అంతే. పెరెంట్స్ పెళ్లి చేసుకోమని బ్రతిమిలాడినా.. ఆమె దృష్టి మాత్రం ఉద్యోగం మీదనే ఉంటుంది. ఓ గుడిలో విన్న ప్రవచనాలతో అటు రాహుల్‌కి, ఇటు విద్యకి పెళ్లిపై ఇంట్రెస్ట్ కలుగుతుంది. పెళ్లి సంబంధాలు చూడమని ఇంట్లో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరి పేరెంట్స్ ఆ పనిలోనే ఉంటారు. అలా ఓ పెళ్లిళ్ల బ్రోకర్ ద్వారా ఇద్దరికి సంబంధం కుదురుతుంది. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటారు. ఇద్దరికి ఉన్న ఈగోల కారణంగా మొదటి రాత్రే గొడవలు మొదలవుతాయి. మరి ఆ గొడవలు ఎక్కడికి దారి తీశాయి? ఇద్దరికి ఉన్న ఆహం ఎలాంటి విబేధాలను తెచ్చిపెట్టింది? ఏ విషయంలో విరిద్దరి మధ్య గొడవలు జరిగాయి? గొడవ జరిగినప్పుడల్లా ఇద్దరిలో ఎవరు తగ్గారు? ఉద్యోగం కోల్పోయిన వాసుకి విద్య సపోర్ట్‌గా నిలిచిందా లేదా? విద్య వాసులు ఇగోతోనే ఉంటారా? లేదా వివాహ బంధాన్ని ఎంజాయ్ చేస్తారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పెళ్లి సబ్జెక్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా కాస్త ఎంటర్టైనింగ్గా తీస్తే చాలు టాలీవుడ్ ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరిస్తారు. దర్శకుడు మణికాంత్ ఆ పనే చేశాడు. ఎంచుకున్న కథ రొటీనే అయినా.. చాలా ఎంటర్టైనింగ్ కథనాన్ని మలిచాడు. కథంతా క్యూట్‌గా సాగిపోతుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ‘పరస్పరం గౌరవం వివాహానికి పునాది’ అనే సందేశాన్ని చాలా వినోదభరితంగా ఇచ్చాడు. అహంతో కూడిన ప్రేమకథలోని భావోద్వేగాలను తెరపై చక్కగా పండించాడు.పెళ్లి జీవితంలో ప్రేమ బాధ్యతల మధ్యలో ఇగో వస్తే ఎలా ఉంటుంది అనే నేపథ్యంలో కథనం సాగుతుంది. ఫస్టాప్‌లో కొత్తగా పెళ్లైన జంట ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాల్లో ఈగోలకి వెళ్లి ఎలా గొడవ పడతారు? అనేది వినోదాత్మకంగా చూపించాడు. ఇక సెకండాఫ్‌లో పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలు.. ఇగోల కారణంగా వచ్చే ఇబ్బందలను చూపించారు. భార్యభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ.. వివాహం బంధం బలంగా ఉండాలి అనే మంచి సందేశాన్ని ఈ సినిమా ద్వారా ఇచ్చారు. కొత్తగా పెళ్లి అయిన ప్రతి జంట..ఈ సినిమాకు కనెక్ట్ అవుతుంది. అయితే కథలో మాత్రం కొత్తదనం ఉండదు. కొన్ని సన్నివేశాలు పాత సినిమాలను గుర్తుకు చేస్తాయి. ఓటీటీ సినిమానే కదా అన్నట్లుగా కొన్ని సన్నివేశాలను సింపుల్‌గా చుట్టేశారనే ఫీలింగ్ కలుగుతుంది. స్క్రీప్‌ప్లే ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేదేమో. డైరెక్ట్‌గా ఓటీటీ రిలీజ్ చేయడం సినిమాకు ప్లస్ పాయింట్. ఓటీటీలోనే స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎంటర్టైన్ కావడానికి వీకెండ్లో ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఎవరెలా చేశారంటే..ఈ జనరేషన్ భార్య భర్తలుగా రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ఇద్దరూ పోటీ పడి నటించారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.ఈగోస్‌తో ఇద్దరి మధ్య జరిగే గొడవలు నవ్వులు పూయిస్తాయి. శివానీ శారీలోనే కనిపిస్తూనే కావాల్సిన చోట అందాలను ప్రదర్శించింది. ఈ జనరేషన్ కొత్త పెళ్ళికొడుకుగా రాహుల్ విజయ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్, లక్ష్మీ దేవిగా అభినయ, నారదుడిగా శ్రీనివాస్ రెడ్డితో పాటు తనికెళ్ల భరణి, శ్రీనివాస్ రెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూపలక్ష్మీ తదితరులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.కల్యాణి మాలిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. అఖిల్ వల్లూరి సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
ఫొటోలు
సిరివెన్నెలకు నివాళిగా ‘నా ఉచ్చ్వాసం కవనం’ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య.. ఫొటోస్ వైరల్! (ఫొటోలు)
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 30 గంటలు (ఫొటోలు)
తిరుమల : వైభవంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు (ఫొటోలు)
గంగమ్మ జాతర : అమ్మా.. గంగమ్మ తల్లీ.. చల్లంగా చూడు (ఫొటోలు)
క్రీడలు
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్‌గానూ హిట్‌మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్‌లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్‌లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్‌పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్‌గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్‌లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్‌ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్‌కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్‌గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్‌కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్.
BCCI: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఐపీఎల్-2025లో..
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ షాకిచ్చింది. రూ. 30 లక్షల జరిమానాతో పాటు తదుపరి మ్యాచ్‌కు దూరంగా ఉండాలని నిషేధం విధించింది.కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసిన హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రోహిత్ స్థానంలో వచ్చినందుకు సొంత జట్టు అభిమానుల నుంచే ఛీత్కారాలు.. కెప్టెన్‌గా తీసుకున్న నిర్ణయాల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నాడు.ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుఆల్‌రౌండర్‌గానూ తన స్థాయికి తగ్గట్లు ఆకట్టుకోలేకపోయాడు హార్దిక్ పాండ్యా. సారథిగానూ సరైన వ్యూహాలు రచించలేక చతికిలపడ్డాడు. ఫలితంగా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై పరాభవం మూటగట్టుకుంది.ఇక లీగ్ దశలో ఆఖరిదై మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. వాంఖడే వేదికగా జరిగిన ఈ పోరులో లక్నో ముంబైని 18 పరుగుల తేడాతో ఓడించింది. దీంతో ముంబై ఖాతాలో పదో పరాజయం నమోదైంది.ఇదిలా ఉంటే.. లక్నోతో మ్యాచ్ సందర్భంగా ముంబై ఇండియన్స్ నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో బీసీసీఐ హార్దిక్ పాండ్యాకు పనిష్మెంట్ ఇచ్చింది.ఐపీఎల్-2025లో తొలి మ్యాచ్ ఆడకుండా నిషేధంఈ మేరకు.. ‘‘ఈ సీజన్లో ముంబై జట్టు చేసిన మూడో తప్పిదం కావున.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద.. స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పాండ్యాకు రూ. 30 లక్షల జరిమానా విధించడంతో పాటు.. జట్టు తదుపరి ఆడే మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు. అంటే ఐపీఎల్-2025లో పాండ్యా తన తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండాలన్నమాట! ఇక పాండ్యాతో పాటు ముంబై జట్టుకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. ముంబై జట్టు మొత్తానికి జరిమానా‘‘లక్నోతో మ్యాచ్ ఆడిన ముంబై తుదిజట్టులోని ఆటగాళ్లందరికీ.. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్రతి ఒక్కరికి రూ. 12 లక్షల జరిమానా లేదంటే మ్యాచ్ ఫీజులో 50 శాతం మేర కోత(ఏది తక్కువగా ఉంటే అది) విధిస్తాం’’ అని తెలిపారు. కాగా ఐపీఎల్-2024లో ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచిన ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.చదవండి: Pat Cummins: సన్‌రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా.. వీడియో వైరల్ #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024
జూన్ 1న బంగ్లాదేశ్‌తో భారత్ వార్మప్ మ్యాచ్
దుబాయ్: ఇప్పుడైతే భారత ఆటగాళ్లంతా ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్లలో ఆడుతున్నారు. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు కలిసి కట్టుగా, భారత జట్టుగా రోహిత్ శర్మ బృందం ఏకైక వార్మప్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్‌లలో జరిగే ప్రపంచకప్‌లో టీమిండియా లీగ్ దశ పోటీలన్నీ అమెరికాలోనే షెడ్యూల్ చేశారు. దీంతో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా అక్కడే ఆడుతుంది. అయితే వేదికను ఖరారు చేయాల్సి ఉంది. పోటీపడే మొత్తం 20 జట్లలో 17 జట్లు మే 27 నుంచి జూన్ 1 వరకు వార్మప్‌లో పాల్గొంటుండగా... డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ పాకిస్తాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్‌లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు లేకుండానే నేరుగా టోర్నీలోనే బరిలోకి దిగనున్నాయి. ఈ మూడు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల వల్లే బహుశా వార్మప్ మ్యాచ్‌లకు దూరంగా ఉండొచ్చు. ఈ నెల 22 నుంచి ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్తాన్ నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
చివరి బెర్త్ ఎవరిదో?
బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్... మూడుసార్లు రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్లు ‘ప్లే ఆఫ్స్’ దశకు అర్హత సాధిస్తాయా లేక లీగ్ దశలోనే నిష్క్రమిస్తాయా ఈరోజే తేలిపోనుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ‘ప్లే ఆఫ్స్’కు అర్హత పొందగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు జట్లు ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం చెన్నై 14 పాయింట్లతో నాలుగో స్థానంలో... బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాయి. » చెన్నైపై బెంగళూరు గెలిస్తే... చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్లు 14 పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో నిలుస్తాయి. ఈ నేపథ్యంలో మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్టుకే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది. » బెంగళూరు, ఢిల్లీ, లక్నో జట్ల కంటే చెన్నై రన్‌రేట్ మెరుగ్గా ఉంది. చెన్నైపై గెలవడంతోపాటు ఆ జట్టు రన్‌రేట్‌ను అధిగమించాలంటే బెంగళూరు 18 పరుగుల తేడాతో చెన్నైను ఓడించాలి. ఒకవేళ చెన్నై లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆ లక్ష్యాన్ని బెంగళూరు 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అయితేనే బెంగళూరుకు ప్లే ఆఫ్స్ బెర్త్ లభిస్తుంది. » మరోవైపు చెన్నై విజయం సాధించినా లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దయినా ఆ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. »స్థానిక వాతావరణ శాఖ ప్రకారం శనివారం బెంగళూరు నగరానికి భారీ వర్ష సూచన ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆ జట్టు ప్రదర్శనపైనే కాకుండా వరుణ దేవుడి దయపై కూడా ఆధారపడి ఉన్నాయి.
బిజినెస్
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
"మేఘాలయ నుంచి కన్యాకుమారి వరకు, శ్రీనగర్ నుంచి జామ్‌నగర్" వరకు భారతదేశంలోని ప్రతి పిల్లవాడు చదవాల్సిన పుస్తకాలలో ఒకటి ఉందని ఇన్ఫోసిస్ 'నారాయణమూర్తి' ఇటీవల పేర్కొన్నారు. పాల్ జీ.హెవిట్ రాసిన "కాన్సెప్టువల్ ఫిజిక్స్" (Conceptual Physics) అనే పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని ఆయన సూచించారు.ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ప్రస్తుతం 'కాన్సెప్టువల్ ఫిజిక్స్' చదువుతున్నట్లు పేర్కొన్నారు. పాల్ హెవిట్ అనే హైస్కూల్ టీచర్ ఈ పుస్తకాన్ని రచించారు. ఇందులో హైస్కూల్ విద్యార్థులకు ఫిజిక్స్ ఎలా బోధించాలో వెల్లడించారని నారాయణమూర్తి చెప్పారు. దీనిని భారతదేశంలోని అన్ని భాషల్లోకి అనువదించడానికి రచయిత అనుమతిస్తారని భావిస్తున్నట్లు వెల్లడించారు.'కాన్సెప్చువల్ ఫిజిక్స్' మొదటిసారిగా 1971లో ప్రచురించారు. ఇందులో క్లాసికల్ మెకానిక్స్ నుంచి ఆధునిక భౌతికశాస్త్రం వరకు సారూప్యతలు, సూత్రాల చిత్రాలతో వెల్లడించారు. ఇది పాఠకులను ఎంతగానో ఆకర్షిస్తుందని నారాయణ మూర్తి అన్నారు.
అంతకంతకూ పెరిగిపోతున్న ఆస్తులు.. రిచ్‌లిస్ట్‌లో రిషి సునాక్ దంపతులు
ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా యూకే ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి వ్యక్తిగత సందప అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. రిషిసునాక్ దంపతుల వ్యక్తిగత ఆస్తి 120 మిలియన్ యూరోలకు పెరిగింది. ‘సండే టైమ్స్ రిచ్ లిస్ట్’ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఆ వార్షిక నివేదికలో రిషి సునాక్ దంపతుల ఆస్తుల వివరాల్ని వెల్లడించింది. అయితే యూకేలో ఆర్ధిక అనిశ్చితి నెలకొన్న వారి ఆస్తులు పెరిగిపోతుండడం గమనార్హం.ఇన్ఫోసిస్‌లో2023లో రిషి సునాక్ దంపతుల సంపద 529 యూరోల నుంచి 651 మిలియన్ యూరోలకు చేరింది. ఈ మొత్తం సంపద పెరుగుదల ఇన్ఫోసిస్‌లోని వాటానే కారణమని సమాచారం. ఇన్ఫోసిస్‌లో అక్షతా మూర్తి వాటా విలువ 55.3 బిలియన్ యూరోలు. ఆమె షేర్ల విలువ 108.8 మిలియన్ యూరోలకు పెరగ్గా.. ఏడాది కాలానికి ఆ విలువ 590 యూరోలకు చేరింది. కింగ్ చార్లెస్ సంపదఇదిలా ఉండగా, కింగ్ చార్లెస్ సంపద ఏడాది కాలంలో పెరిగిందని, 600 మిలియన్ యూరోల నుండి 610 మిలియన్ యూరోలకు పెరిగినట్లు సండే టైమ్స్ రిచ్ లిస్ట్ నివేదించింది. అదే సమయంలో బ్రిటీష్ బిలియనీర్ల సంఖ్య తగ్గిపోయిందని ఈ నివేదిక హైలెట్ చేసింది. తగ్గిపోతున్న బిలియనీర్లు2022లో బిలియనీర్ల గరిష్ట సంఖ్య 177 కాగా.. ఈ ఏడాది 165కి పడిపోయింది. ఈ క్షీణతకు కారణం కొంతమంది బిలియనీర్లు అధిక రుణ రేట్లు కారణంగా వారి సంపద మంచులా కరిగిపోగా.. మరికొందరు దేశం విడిచిపెట్టారని బ్రిస్టల్ లైవ్ నివేదించింది .యూకేలోనూ భారతీయుల హవాబ్రిటన్లోని 350 మంది కుబేరులు ఉండగా.. ఆ కుటుంబాల మొత్తం సంపద 795.36 బిలియన్లుగా ఉందని తాజా గణాంకాలు చూపిస్తున్నాయి. ఈ సంవత్సరం యూకే బిలియనీర్ల జాబితాలో హిందుజా గ్రూప్ అధినేత గోపీచంద్ హిందూజా, అతని కుటుంబం నిలిచింది. హిందూజా కుటుంబం సంపద ఈ ఏడాది 35 బిలియన్ యూరోల నుండి 37.2 బిలియన్ యూరోలకు పెరిగింది.
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ట్విటర్ రీ బ్రాండింగ్‌పై మస్క్ ట్వీట్
ట్విటర్ పూర్తిగా ఎక్స్.కామ్‌గా రీబ్రాండ్ అయ్యింది. ఎక్స్.కామ్‌లో పలు కార్యకలాపాలు ట్విటర్ పేరు మీదే జరిగేవి. అయితే ఇప్పుడు పూర్తి ఎక్స్.కామ్ నుంచే జరుగుతున్నాయని ఆ సంస్థ అధినేత ఎలోన్ మస్క్ శుక్రవారం తెలిపారు.ఎలోన్ మస్క్ 2022 చివరిలో 44 బిలియన్ల డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత జరిగిన పలు పరిణామాల అనంతరం గత ఏడాది జులైలో ట్విటర్‌ను ఎక్స్. కామ్‌గా రీ బ్రాండ్ చేస్తున్నట్లు మస్క్ వెల్లడించారు. అయితే నిన్నటి వరకు ట్విటర్ లోగో, బ్రాండింగ్ మారింది. కానీ డొమైన్ పేరు ట్విటర్‌గా కొనసాగుతూ వచ్చింది. తాజాగా ట్విటర్.కామ్ డొమైన్ స్థానంలో ఇప్పుడు ఎక్స్.కామ్ వచ్చి చేరినట్లు మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు. పోస్ట్ పోస్ట్ చేయడం, లైక్ చేయడం, బుక్‌మార్క్ చేయడం లేదా రీట్వీట్ చేసేందుకు గాను యూజర్లు కొద్ది మొత్తంలో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని గత నెలలో మస్క్ ప్రకటించారు. ఆ మొత్తం సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.100లోపు ఉంటుందని అంచనా. ప్రస్తుతానికి ఈ సబ్స్క్రిప్షన్ పద్దతి న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో పరీక్షిస్తున్నారు. త్వరలో దీనిని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేసేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 2,500 కంటే ఎక్కువమంది ఫాలోవర్స్ కలిగి ఉన్న యూజర్ అకౌంట్లు ఎక్స్.కామ్‌లో ప్రీమియం ఫీచర్లను ఉచితంగా అందిస్తున్నట్లు మస్క్ ప్రకటించారు. 5000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లకు ప్రీమియం ప్లస్ ఉచితంగా లభిస్తుంది అని మస్క్ ట్వీట్లో పేర్కొన్నారు.
వీడియోలు
అడ్డంగా దొరికిన నకిలీ పోలీసులు...
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
పోలీసులపై మల్లారెడ్డి ఫైర్
గెలుపుపై ఆశలు లేవు..పవన్ కళ్యాణ్ సైలెంట్
చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు
Watch Live: తెలంగాణ EAMCET ఫలితాలు విడుదల..
టీడీపీ ఎగనామం: సర్వేల పేరుతో పనిచేయించుకొని డబ్బులు ఎగ్గొట్టిన టీడీపీ
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
దాష్టీకానికి పరాకాష్ట
ఫ్యామిలీ
Pavithra Chari నా కల నెరవేరింది, ఆయనతో పనిచేయడం నా అదృష్టం
దిల్లీకి చెందిన పవిత్రాచారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే... మల్టీ–టాలెంటెడ్ ఆర్టిస్ట్. ప్లేబ్యాక్ సింగర్, సాంగ్ రైటర్, వోకలిస్ట్, కంపోజర్‌గా రాణిస్తోంది. ‘కళ కళ కోసం కాదు. సమాజం కోసం’ అని నమ్మిన పవిత్ర తన ‘కళ’తో వివిధ స్వచ్ఛందసేవా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. తాజాగా ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా’ జాబితాలో ‘ఎంటర్టైన్మెంట్’ విభాగంలో చోటు సాధించింది... దశాబ్దకాలం పాటు ఇండిపెండెంట్ ఆర్టిస్ట్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుంది పవిత్ర. ఆ తరువాత సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఏఆర్ రెహమాన్‌లాంటి దిగ్గజాలతో కలిసి పనిచేసింది. ప్రతి దిగ్గజం నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడంలో ముందుంటుంది పవిత్ర. ‘శూన్యం నుంచి కూడా రెహమాన్ సంగీతం సృష్టించగలరు’ అంటుంది. 65వ గ్రామీ అవార్డ్‌లలో పవిత్ర పాట ‘దువా’ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీకి నామినేట్ అయింది. హెచ్‌సీఎల్, ఇండిగో ఎయిర్లైన్స్లాంటి ప్రముఖ కంపెనీల యాడ్స్‌లో నటించింది. ‘అనిరుథ్ వర్మ కలెక్టివ్’లో భాగంగా యూఎస్‌లో ఎన్నో ప్రాంతాలలో తన సంగీతాన్ని వినిపించింది. ‘చిత్రహార్ లైవ్’ టైటిల్‌తో చేసిన ఇన్స్టాగ్రామ్ సిరీస్‌కు మంచి పేరు వచ్చింది, ‘ఈ ప్రాజెక్ట్ ద్వారా సంగీతానికి సంబంధించిన నాస్టాల్జియాను హైలైట్ చేశాను. వ్యక్తిగతంగా, ఆన్లైన్లో ఈ ప్రాజెక్ట్‌కు ఎంతో స్పందన వచ్చింది’ అంటుంది పవిత్ర.గత సంవత్సరం కొన్ని అద్భుతమైన వోటీటీ ప్రాజెక్ట్‌లలో భాగమైన పవిత్ర ఆ ప్రాజెక్ట్‌ల నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడమే కాదు, తన ప్రతిభతో వాటికి కొత్తదనాన్ని తెచ్చింది. ‘దిల్లీ అమ్మాయి’గా పాపులర్ అయినప్పటికీ పవిత్ర మూలాలు చెన్నైలో ఉన్నాయి. తన సంగీతయాత్రలో భాగంగా దిల్లీ, చెన్నై, ముంబై నగరాల మధ్య తిరుగుతుంటుంది. ఇప్పుడు చెన్నైలో ఎక్కువ రోజులు ఉండడానికి ప్రాధాన్యత ఇస్తోంది. హిందీ పాటలే కాదు తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలాంటి భాషల్లోనూ పాడుతోంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో భాగం కావడమే కాదు వాటిపై తనదైన ముద్ర వేయడంలో ప్రత్యేకత సాధించింది పవిత్ర.‘ఒకేదగ్గర ఉండిపోవడం కంటే నిరంతర అన్వేషణతో కొత్త దారులు వెదుక్కోవడం నాకు ఇష్టం. ప్రతి దారిలో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్లడం అంటే ఇష్టం. కొత్త ఆసక్తి అన్వేషణకు కారణం అవుతుంది. ఆ అన్వేషణలో భాగంగా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్లే అవకాశం దొరుకుతుంది. మల్టిపుల్ ప్రాజెక్ట్‌లలో గుర్తింపు తెచ్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటుంది పవిత్ర. సంగీతం, సామాజికం అనేవి రెండు వేరు వేరు ప్రపంచాలని ఎప్పుడూ అనుకోలేదు పవిత్ర. ఆర్ట్స్–బేస్డ్ థెరపిస్ట్‌గా ఎంతోమందికి సాంత్వన చేకూర్చింది. వారి నడకకు కొత్త బలాన్ని ఇచ్చింది.‘లైఫ్‌స్కిల్స్ ఎడ్యుకేషన్ విత్ మ్యూజిక్’ కాన్సెప్ట్‌తో వివిధ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల కోసం సంగీత కచేరీల ద్వారా నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పాటే కాదు పరిశోధన కూడా.. పవిత్రకు సంగీతప్రపంచం అంటే ఎంత ఇష్టమో, సంగీత ధోరణులకు సంబంధించిన పరిశోధన అంటే కూడా అంతే ఇష్టం. ప్రఖ్యాత గాయని శుభాముద్గల్ దగ్గర సంగీతంలో శిక్షణ తీసుకున్న పవిత్ర ‘ఖాయాల్’పై ఆసక్తి పెంచుకోంది. ఈ సంగీత ప్రపంచంలోని స్త్రీవాద ధోరణుల గురించి లోతైన పరిశోధన చేసింది. భారత ఉపఖండంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన ప్రధాన రూపం... ఖాయాల్. అరబిక్ నుంచి వచ్చిన ఈ మాటకు అర్థం... ఊహ. ‘హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్యార్థిగా ఖాయాల్ సంగీతంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. పరిశోధన ఫలితంగా కొత్త విషయాల పట్ల అవగాహన ఒక కోణం అయితే నా గానాన్ని స్వీయ విశ్లేషణ చేసుకోవడం మరో కోణం’ అంటున్న పవిత్ర ఖాయాల్ సంగీతానికి సంబంధించి రిసోర్స్ బ్యాంక్‌ను తయారు చేసింది. దీనికి ముందు ఖాయాల్ రచనలు, వాటి మూలం, సామాజిక, సాంస్కృతిక నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతో అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులతో మాట్లాడింది.
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.హీరా మండి..మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.భారీ నగలుపర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.అసలు సిసలు బంగారంతో‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్.
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
పాకిస్థాన్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడైన వ్లాగర్‌గా పాపులర్ అయిన మహమ్మద్ షిరాజ్ తన ఫ్యాన్స్‌కు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. 1.57 మిలియన్లకుపైగా ఫాలోయర్స్‌ని సొంతం చేసుకున్న షిరాజ్ ఇదే నా చివరి వ్లాగ్ అంటూ కన్నీరుమున్నీరయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటవైరల్‌గా మారింది.మొహమ్మద్ షిరాజ్, తన యూట్యూబ్ అనుచరులకు భావోద్వేగ వీడ్కోలు పలికాడు."మేన్ ఆజ్ సే వ్లాగ్ నహీ బనౌంగా. మేరే అబ్బు నే బోలా హై ఆప్ కుచ్ దిన్ పధై కరో ఔర్ వీడియో నహీ బనావో (నేను ఇకపై వ్లాగ్‌లు చేయను. మా నాన్న నన్ను చదువుకోవాలని, ప్రస్తుతానికి వీడియోలు చేయవద్దని అడిగారు)" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "లేకిన్, ముఝే వ్లోగ్ బనానే కా బోహత్ షౌఖ్ హై. ఇస్లీయే, ఆజ్ మేరా ఆఖ్రీ వ్లాగ్ హై. మైన్ క్యా కరూం(కానీ నాకు వ్లాగ్‌లు చేయడం చాలా ఇష్టం. కానీ, ఇదే నా చివరి వ్లాగ్. నేను ఏమి చేయాలి?)" అని షిరాజ్ తన వీడియోలో తెలిపారు.అలాగే అభిమానులందరి ప్రేమకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు వ్లాగ్స్ చేయడానికి తనను అనుమతించమని తన తండ్రిని అభ్యర్థించమని కూడా అభిమానులను కోరాడు. ఈ వీడియో ఆరు లక్షలకుపై వ్యూస్ సాధించింది.కమెంట్ల రూపంలో తమ ప్రేమను అభిమానాన్ని ప్రకటించారు. ‘‘నీ భవిష్యత్తు కోసం నీ తండ్రి మంచి నిర్ణయం తీసుకున్నారు, అల్లా మిమ్మల్ని , మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు" అని ఒక వినియోగదారు రాశారు. "అయ్యో నిన్ను మిస్ అవుతాను" అని మరొకరు వ్యక్తం చేశారు. చదువు చాలా ముఖ్యం చిన్నా అని ఒకరు, కష్టపడి చదువుకో, మరోవైపు వ్లాగ్‌లు కూడా చేయి మొరకరు కమెంట్ చేశారు. చాలామంది"మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు" అని కమెంట్ చేశారు.కాగా పాక్‌లోని ఖప్లు అనే నగరానికి చెందిన షిరాజ్ తన రోజు వారీ దినచర్యతోపాటు, తన చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను, మంచు పర్వతాలతో కూడిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాగా పేరు సంపాదించాడు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడు వేములవాడకు నరేంద్ర మోదీ... రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న ప్రధానమంత్రి... ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
టీడీపీ దాష్టీకానికి పరాకాష్ట
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేశారనే ఆరోపణలతో టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు ఓ మహిళా వలంటీర్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊళ్లో అందరికీ తలలో నాలుకలా వ్యవహరించిన ఓ సేవకురాలిని టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం పొట్టన పెట్టుకోవడం దిగ్భ్రాంతి పరుస్తోంది. తప్పుడు ఆరోపణలతో వేధింపులు, ఫిర్యాదు, పోలీసుల విచారణతో తీవ్ర భయాందోళనలకు గురై విజయనగరం రూరల్ మండలం దుప్పాడ గ్రామంలో వలంటీరు బొబ్బాది సంతోషి (36) గుండె ఆగిపోయింది. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంతోషి భర్త బొబ్బాది కృష్ణ విజయనగరం కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జయదీప్ ఇటీవలే పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. అమ్మాయి లహరి ఎనిమిదో తరగతి చదువుతోంది. సంతోషి వలంటీరుగా చేరిన తర్వాత గ్రామంలో తనకు అప్పగించిన 50 కుటుంబాలకు నిత్యం అందుబాటులో ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి పథకాన్ని అర్హులకు చేర్చుతూ వారి మన్ననలు అందుకుంది. తనది పేద కుటుంబమే అయినా గ్రామంలో ఏ పేద వారూ ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో సేవలందించింది. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారుజామునే అవ్వాతాతలకు పింఛన్ అందించడంలో పోటీ పడేది. సీఎం జగన్ అంటే అభిమానం. ఇవన్నీ అదే గ్రామంలోని టీడీపీ నాయకులకు కంటగింపుగా మారాయి. ఏదో విధంగా వలంటీర్లపై కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్న టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకుని కుట్రలు, కుతంత్రాలకు తెర లేపారు. టీడీపీ నేతల బెదిరింపులుటీడీపీ ప్రభుత్వం వస్తే వలంటీర్ ఉద్యోగం ఇప్పిస్తామంటూ స్థానిక టీడీపీ నేతలు గ్రామంలో 50 మంది యువకులను మభ్యపెట్టి ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ వలంటీర్లు బొబ్బాది సంతోషి, నారాయణమ్మ, రామలక్ష్మి, స్వాతి, కృష్ణవేణి, కోటమ్మలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. పూర్వాపరాలు సరిగా విచారించకుండానే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఆగమేఘాలపై ఆ ఆరుగురు వలంటీర్లను సస్పెండ్ చేశారు. పోలీసులతో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. పుట్టుమచ్చలు, తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడు రోజుల కిందట సంతోషికి ఫోన్ చేసి అడిగారు. అంతకు ముందు గ్రామంలో నిర్వహించిన టీడీపీ ప్రచార సభలో కూడా ఆ నాయకులు వలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఉద్యోగాలు ఊడగొట్టి కేసులు పెట్టించామని, తమ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. పోలీసులు గ్రామంలోకి వచ్చి ఇంటింటి విచారణ చేశారు. ఇవన్నీ సంతోషినిని ఆందోళనకు గురి చేశాయి. ఇదిలా ఉండగా పుట్టుమచ్చలు తదితర వివరాలు చెప్పాలని పోలీసులు మూడ్రోజుల కిందట ఆమెకు ఫోన్ చేయడంతో తీవ్రంగా భయాందోళనకు గురైంది. గురువారం ఛాతీలో పట్టేసినట్టు ఉండటంతో తొలుత గ్యాస్ తాలూకు నొప్పిగా భావించింది. కొంత సేపటి తర్వాత గుండెల్లో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు విజయనగరంలో డాక్టర్లకు చూపించారు. వారి సూచనలతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి శుక్రవారం ఆ పేదరాలి గుండె ఆగిపోయింది. సంతోషి హఠాన్మరణం ఆమె కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది. గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు ఆమె అంతిమ యాత్రలో పాల్గొని కంట నీరు పెట్టారు. కాగా, ఇంత జరిగినా టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడటానికి ఆ కుటుంబం భయపడిపోతోంది. తోటి వలంటీర్లంతా లోలోన కుమిలిపోతున్నారు.
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్‌ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు.
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
యశవంతపుర: గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన భార్యకు వీడియో కాల్ చేసి తిరిగి రావాలని అర్థించాడు ఓ భర్త. దీనికి ఆమె నిరాకరించడంతో బెదిరించాలని ఉరేసుకోబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరు బాగలగుంటెలో చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అమిత్‌కుమార్ సాహ (28) దాసరహళ్లిలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం హసన్‌కు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదువు నిమిత్తం భార్యను నర్సింగ్ కోర్సులో చేర్చాడు. ఆమె నిరంతరం ఫోన్లో స్నేహితులతో మాట్లాడుతూ తనను పట్టించుకోకపోవడంతో భార్యతో గొడపడేవాడు. ఇద్దరి మధ్య గొడవలు పెరగడంతో ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో గురువారం అమిత్ భార్యకు వీడియో కాల్ చేసి ఇంటికి రావాలని బతిమాలాడు. రాకపోతే ఉరి వేసుకొని చనిపోతానని బెదిరించాడు. ఇంతలో చేతిలోని మొబైల్ ఫోన్ కింద పడటంతో పాటు గొంతుకు ఉరి బిగిసి మృత్యువాత పడ్డాడు.