సుదీర్ఘంగా ఏపీ కేబినెట్, రైతుల సమస్యలపై చర్చే లేదు

4 Jul, 2015 19:49 IST|Sakshi

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆరు గంటల పాటు కొనసాగినా రైతుల సమస్యలపై అసలు చర్చించలేదు. అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యపై ఏపీ కేబినెట్ చర్చించకపోవడం గమనార్హం. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, విత్తనాల కొరతపై రాష్ట్ర కేబినేట్ దృష్టిసారించ లేదు.

పంటలకు మద్ధతు ధర పెంచుతున్నట్లు కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఎటువంటి బోనస్ ప్రకటనలపై మంత్రులు చర్చించలేదు. సిండికేట్ బ్యాంకు మేనేజర్ వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన యువరైతు ఉరవకొండలోని బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు