ఢిల్లీ సభలకు వెళ్లిన వారికి హోం ఐసోలేషన్‌

30 Mar, 2020 08:19 IST|Sakshi

జిల్లాలో 42 మందిని గుర్తించిన అధికారులు

పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది 

సాక్షి, మచిలీపట్నం: కరోనా (కోవిడ్‌–19) పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. ఢిల్లీలో నిర్వహించిన ఓ మత ప్రచార సభ మూడు రోజుల పాటు జరిగింది. ఈ సభకు తమిళనాడు, కర్నాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. వారంతా తిరిగి ఇప్పుడు స్వస్థలాలకు చేరుకున్నారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన దంపతులకు శనివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఈ సభకు వెళ్లిన మిగిలిన వారికి కూడా కరోనా సోకి ఉంటుందని అనుమానంతో వారందర్ని గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మత్తు లేని జీవితం వ్యర్థమని..)

జిల్లాలో 42మంది గుర్తింపు.. 
ఢిల్లీ సభలకు రాష్ట్రవ్యాప్తంగా 472మంది వెళ్లినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. కృష్ణా జిల్లా పరిధిలో 42 మంది ఉన్నట్టుగా గుర్తించారు. వీరిలో విజయవాడ సిటీ పరిధిలో 26 మంది గ్రామీణ జిల్లాలో మరో 16 మంది ఉన్నారు. ఈ సభలకు వీరంతా ఈ నెల 13వ తేదీన వెళ్లిన వీరంతా తిరిగి 18వ తేదీన నిజాముద్దీన్, దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు. (సీఎం ఇంటి చుట్టూ తిరిగిన కరోనా రోగులు)

విజయవాడతో పాటు గ్రామీణ జిల్లాలో ఈ సభలకు వెళ్లిన ప్రతి ఒక్కర్ని గుర్తించారు. గ్రామీణ జిల్లాలో మచిలీపట్నం, నూజివీడు, చందర్లపాడు, వత్సవాయి, వీరులపాడు, నందిగామ, కేశవరం, జి.కొండూరు, పాపవినాశం ప్రాంతాలకు చెందిన 16 మందితో పాటు వారితో ప్రయాణించిన మరో 8 మందిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. వీరందరికి పరీక్షలు నిర్వహించారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరి రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అంతేకాకుండా వీరు ప్రయాణించిన బోగీల్లో ఇంకా ఎవరైనా జిల్లాకు చెందిన వారు ఉన్నారా? ఇక్కడకు వచ్చిన తర్వాత వీరు స్థానికంగా ఏ ప్రాంతాల్లో తిరిగారు. ఎవరెవర్ని కలిసారో ఆరా తీస్తున్నారు. (ఏపీలో మరో రెండు పాజిటివ్‌)

జిల్లాకు చేరిన అజ్మీర్‌ భక్తులు.. 
మరొక పక్క అజ్మీర్‌లో చిక్కుకున్న వారందర్ని ప్రత్యేక వాహనాల్లో రాష్ట్రానికి తరలించారు. వీరిలో 44 మంది గుంటూరుకు చెందిన వారు కాగా, నలుగురు మచిలీపటా్ననికి చెందిన వారు. జిల్లాకు చెందిన నలుగుర్ని విజయవాడలో క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు