లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాల్సిందే..

2 May, 2020 20:10 IST|Sakshi

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి

కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌

సాక్షి, గుంటూరు: జిల్లాలో కరోనా వైరస్‌ బారినపడిన మరో 32 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారని.. వారిని డిశ్చార్జ్‌ చేయబోతున్నామని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌ మరికొన్ని రోజులు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను తొలగించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమన్నారు. జిల్లా మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌లో ఉందని తెలిపారు. కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని.. నివారణా చర్యలను ప్రతిఒక్కరూ పాటించాలని కలెక్టర్‌ వెల్లడించారు.

తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు: రూరల్‌ ఎస్పీ విజయరావు
నరసరావుపేటలో పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయరావు తెలిపారు. జిల్లావాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కరోనాపై సోషల్‌మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠినచర్యలు తీసుకంటామని ఎస్పీ హెచ్చరించారు.

కఠినంగా లాక్‌డౌన్‌: అర్బన్‌ ఎస్పీ రామకృష్ణ
గుంటూరు అర్బన్‌ పరిధిలో లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని అర్బన్‌ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు.పోలీసులు ఇచ్చిన పాస్‌లను దుర్వినియోగం చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా మొత్తం రెడ్‌జోన్‌లో ఉందని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు