ఏపీలో 164కు చేరిన కరోనా కేసులు

3 Apr, 2020 22:57 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ జవహర్‌ రెడ్డి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 2, విశాఖపట్నంలో 1 నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 164కు చేరుకుంది. క​రోనా నుంచి కోలుకున్న ఇద్దరిని శుక్రవారం డిశ్చార్జ్ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒంగోలు, రాజమండ్రిలో ఒక్కొక్కరు చొప్పున డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించింది. మొత్తం ఇప్పటి వరకు నలుగురు బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు