కోయంబేడు మార్కెట్ కు వెళ్లే వర్తకులు అప్రమత్తంగా ఉండాలి

10 May, 2020 20:51 IST|Sakshi

ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిక

సాక్షి, విజయవాడ : చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లే వర్తకులు , డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటన లో సూచించింది. ఈ రోజు  చిత్తూరు జిల్లాలో నమోదైన 16 కేసుల వివరాల్ని పరిశీలించగా  పాజిటివ్ కేసులు కోయంబేడు నుంచి వచ్చిన వారుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించిందని పేర్కొంది. అలాగే  కర్నూలు జిల్లాలో గుర్తించిన కేసులు కూడా కోయంబేడు నుంచి వచ్చిన కేసులే అని తెలిపింది. నెల్లూరు లో కూడా కొన్ని కేసులకు కోయంబేడు మూలాలున్నాయి. భవిష్యత్తులో కూడా ఈ మూడు జిల్లాల్లో మరిన్ని కేసులు కోయంబేడు వెళ్లొచ్చే వారి నుంచి నమోదయ్యే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ భావిస్తోంది. అక్కడికెళ్లే వారిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోయంబేడు వెళ్లే వర్తకులు‌ , డ్రైవర్లు వైద్య ఆరోగ్య శాఖ సూచనల్ని పాటించాలనీ మాస్కులు , శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలనీ విజ్ఞప్తి చేసింది.
(చదవండి : కరోనా: కోయంబేడు ముప్పు ముంచుకొస్తోంది)

మరిన్ని వార్తలు