రాష్ట్రానికి మొండిచేయి చూపిన మోదీ ప్రభుత్వం

6 Jul, 2019 18:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపిందని సీపీఎం నాయకులు విజయవాడ బీసెంట్ రోడ్లో తమ నిరసన తెలిపారు. ప్రజలకు మోదీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందంటూ కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలు, నూతన రాజధానికి నిధుల ప్రస్తావనే రాలేదన్నారు.

ప్రభుత్వ రంగాన్ని ప్రవేటీకరణ చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై పెనుభారం మోపారని విమర్శించారు. జాతీయ సంపదను కార్పొరేట్ వ్యక్తుల చేతులకు కట్టబెట్టే విధంగా ఈ బడ్జెట్ ఉందన్నారు.  

>
మరిన్ని వార్తలు