కోవిడ్‌: వారిలో 89 మందికి నెగిటివ్‌ 

4 Apr, 2020 09:05 IST|Sakshi

పూర్తి ఆరోగ్యంతో రాజమహేంద్రవరం యువకుడి డిశ్చార్జి

రోజుకు సగటున 90 నమూనాలు పరీక్షిస్తే 69కిపైగా నెగిటివ్‌గా నిర్ధారణ  

సాక్షి, కాకినాడ:  ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న ‘కోవిడ్‌–19’ మహమ్మారి జిల్లా అధికారుల పర్యవేక్షణ, వైద్యుల కృషి ఫలితంగా జిల్లాలో క్రమేపీ తన ఉనికిని కోల్పోతోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడ వైరస్‌ అనుమానితులను క్వారంటైన్‌కు తరలించడం, నమూనాలు సేకరించడం పాజిటివ్‌గా తేలితే వారిని ప్రత్యేక ఐసొలేషన్‌ గదిలో పెట్టి వైద్యం చేయడం సత్ఫలితాలనిస్తోంది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన లండన్‌ యువకుడికి తొలిసారిగా జిల్లాలో పాజిటివ్‌ కేసుగా నమోదవడంతో యంత్రాంగంలో మరింత స్ఫూర్తిని నింపింది.  (ప్రధాన మంత్రి విరాళాలు కొల్లగొట్టడానికి.. )

ఢిల్లీ నుంచి వచ్చినవారిలో 89 మందికి నెగిటివ్‌ 
మతపరమైన ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్టయిన 163 మందిని రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీలోని నిజామొద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారితో కలిసిన వారుగా వైద్యులు వీరిని నిర్ధారించారు. వీరిలో 89 మందికి నెగిటివ్‌ రావడంతో శుక్రవారం డిశ్చార్జ్‌ చేశారు. ఇంకా నలుగురు మాత్రమే క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి కూడా నెగిటివ్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యలు స్పష్టం చేస్తున్నారు. బొమ్మూరు క్వారంటైన్‌లో 14 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నవారితోపాటు, మూడు రోజుల కిందట కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికి చేతిపై స్టాంప్‌ వేసి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సరిత తెలిపారు.(పోర్టబుల్‌ వెంటిలేటర్‌)

ప్రత్యేక పర్యవేక్షణ 
కరోనా నియంత్రణలో భాగంగా అధికార యంత్రాంగం, వైద్యాధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. కోవిడ్‌–19 వైరస్‌ అనుమానిత వ్యక్తులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కలి్పంచారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 5000 ఐసోలేషన్‌ పడకలు, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 15,000 సామర్థ్యం కలిగిన క్వారంటైన్లను ఏర్పాటు చేశారు. 
ఇతర ప్రాంతాల నుంచి 

వచ్చినవారిపై సర్వే  
జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి డేటా స్వీకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన జాబితాలతోపాటు వలంటీర్లు, ఆశ, ఏఎన్‌ఎంల సర్వేలలో గుర్తించిన ప్రకారం 3,441 మంది ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరిలో ఢిల్లీ నిజామొద్దీన్‌ ప్రార్థనలకు వెళ్లిన వారు 33 మందిగా గుర్తించారు. వీరిని క్వారంటైన్లకు తరలించారు.

రోజుకు సగటున 90 నమూనాల పరీశీలన
జిల్లాలో ప్రతి రోజూ సగటును ‘కోవిడ్‌–19’ అనుమానితులకు సంబంధించిన 90 నమూనాలు సేకరిస్తున్నారు. అందులో 70 వరకు నెగిటివ్‌గా నిర్ధారణవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం వరకు 267 నమూనాలు పరీక్షించగా..9 పాజిటివ్‌ (శుక్రవారం ఒకరు డిశ్చార్జి), 23 ఫలితాలు తేలాల్సి ఉంది. అంటే 10 శాతానికి తక్కువే పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. శుక్రవారం మరో రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి 

మరిన్ని వార్తలు