అరకు ఉత్సవాల పోస్టర్‌ విడుదల

19 Feb, 2020 11:16 IST|Sakshi

రెండు రోజులపాటు అరకు ఉత్సవాలు

సాక్షి, విశాఖపట్నం : అరకు ఉత్సవాల పోస్టర్‌ను పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ బుధవారం విశాఖలో విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి రెండు రోజులపాటు జరిగే ఉత్సవాల కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయగా.. నేడు ఉత్సవాల షెడ్యూల్‌ను మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవితో పాటు  అరకు ఎమ్మెల్యే చెట్టి ఫల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు