భీమిలీ క్రాస్‌ రోడ్డు వద్ద ప్రమాదం, యువకుడి మృతి

5 Dec, 2017 19:56 IST|Sakshi

విశాఖపట్నం: విశాఖ జిల్లా భీమిలి క్రాస్‌ రోడ్డు జంక్షన్‌ వద్ద మంగళవారం ప్రమాదం జరిగింది. హోండా ఆక్టివాపై వస్తున్న ఇద్దరిని వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంవీపీ కాలనీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఫిరోజ్‌(20), అనిశ్చితలకు తీవ్రగాయాలు అయ్యాయి. మధురవాడలోని గాయత్రి ఆసుపత్రికి తరలిస్తుండగా ఫిరోజ్‌ మార్గమధ్యంలోనే చనిపోయాడు.  ఫిరోజ్‌ వరంగల్‌ నిట్‌లో ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా