యాపిల్‌ చేతికి ప్రముఖ పత్రిక

13 Mar, 2018 17:44 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ ఫోన్ల కంపెనీ యాపిల్‌ ఒక డిజిటల్‌ పత్రికను కొనుగోలు చేసింది. ప్రపంచలోని ఉత్తమమైన 200పైగా మ్యాగజైన్లను ఒక సైట్‌లో పొందుపర్చి పాఠకులకు అందిస్తుంది టెక్స్‌చర్‌ అనే ఆన్‌లైన్‌ పత్రిక. పాఠకులు నెలకు 9.99 డాలర్లు చెల్లించి తమకు నచ్చిన కథలను, వ్యాసలను ఈ ఆన్‌లైన్‌ పత్రికలో చదువుకోవచ్చు. ఈ పత్రికనే యాపిల్‌ కొనుగోలు చేసింది. అయితే ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక విషయాలను యాపిల్‌ సంస్థ ప్రకటించలేదు. 

అత్యుతమమైన ప్రమాణాల జర్నలిజాన్ని పెంపొందించడానికి ఈ పత్రికను కొనుగోలు చేసినట్టు యాపిల్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఆపిల్‌ ఇంటర్‌నెట్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీసెస్‌కి వైస్‌ ప్రెసిడెంట్‌ ఎడ్డీ క్యూ తెలిపారు. నెట్‌ ఫ్లిక్స్‌ ఆన్‌లైన్‌ పత్రికలో ప్రపంచ ప్రఖ్యాత పత్రికలైన ది న్యూయార్క్‌, పీపుల్‌,  టైమ్‌, జీ క్యూ వంటి మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega