సూచీలు పైపైకి..

25 Mar, 2020 16:28 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్‌లో బుధవారం పండుగ జోరు నెలకొంది. కరోనా భయాలు, దేశవ్యాప్తంగా మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటనా ఇన్వెస్టర్లను ప్రభావితం చేయలేదు. మహమ్మారి ప్రభావాన్ని కట్టడి చేసేందుకు ఆర్థిక ప్యాకేజ్‌ త్వరలో వెల్లడవుతుందన్న అంచనాలతో పాటు గ్లోబల్‌ మార్కెట్ల ఊతంతో అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఆరంభ నష్టాలను అధిగమించి కీలక సూచీలు పరుగులు పెట్టాయి. 11 ఏళ్ల గరిష్ట స్ధాయిలో సూచీలు దూసుకువెళ్లడంతో ఒక్కరోజులోనే మదుపుదారుల సంపద రూ 4.7 లక్షల కోట్ల మేర పెరిగింది.

రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌, హెచ్‌డీఎప్‌సీ ద్వయంలో కొనుగోళ్ల జోరు కనిపించింది. మొత్తమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1861 పాయింట్ల లాభంతో 28,535 పాయింట్ల వద్ద ముగియగా, 516 పాయింట్లు ఎగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 8317 పాయింట్ల వద్ద క్లోజయింది. కాగా, కరోనా వైరస్‌ కేసులు తగ్గడంతో పాటు ఈ మహమ్మారి ప్రభావాన్ని నిరోధించేందుకు మెరుగైన ఆర్థిక ప్యాకేజ్‌ ప్రకటిస్తే స్టాక్‌మార్కెట్‌ క్రమంగా కుదురుకుంటుందని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

చదవండి : కరోనా క్రాష్‌ : రూ 13.88 లక్షల కోట్ల సంపద ఆవిరి

మరిన్ని వార్తలు