హ్యుందాయ్‌ ఇండియాకి భారీ జరిమానా

15 Jun, 2017 12:40 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్  కంపెనీకి  పెద్ద ఎదురు  దెబ్బ  తగిలింది.  వాహన విక్రయాల్లో, వ్యాపార నిర్వహణలో హ్యుందాయ్ ఇండియా  తప్పుడు విధానాలను అనుసరించిందని ఆరోపిస్తూ కాంపిటీషన్ కమీషన్ భారీ జరిమానా విధించింది. అక్రమ విధానాలు,  కార్లపై అక్రమ డిస్కౌంట్లు అందించినందుకు గాను రూ. 87 కోట్ల  జరిమానా విధించింది.

44 పేజీల లిఖితపూర్వక  ఆర్డర్‌లో  కొరియా కార్‌ మేకర్‌  పోటీ-వ్యతిరేక విధానాలను అవలంబించిందని  సీసీఐ పేర్కొంది.  ఈ ఉల్లంఘన ద్వారా సంబంధిత టర్నోవర్ని నిర్ణయించే ప్రయోజనాలతోపాటు, ఈ వాహనాల అమ్మకం నుంచి వచ్చే ఆదాయం పరిగణనలోకి తీసుకోవాలని  వ్యాఖ్యానించింది.

అయితే దీనిపై హ్యుందాయ్ ఇండియా స్పందించింది. ఈ ఆర్డర్‌తో  తాము తీవ్ర ఆశ్చర్యంలో మునిగిపోయామని ప్రకటించింది.  దీన్ని నిశితంగా  అధ్యయనం చేస్తున్నామని  చెప్పింది. తమ వినియోగదారులు, ఇతర  ఛానెల్ పార్టనర్ల ప్రయోజనాలను కాపాడడానికి తగిన స్థాయిలో ఆర్డర్‌ ను సవాలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపింది.
 

మరిన్ని వార్తలు