-

పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!

28 May, 2016 04:43 IST|Sakshi
పెద్ద బ్యాంకులుగా మిగిలేవి పదే!

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయం
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై జయంత్ సిన్హా వ్యాఖ్య

 బెంగళూరు: భారత్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ విలీనం, పెద్ద బ్యాంకుల ఏర్పాటుపై ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్‌సిన్హా శుక్రవారం కీలక ప్రకటన చేశారు. మొండిబకాయిల సమస్య  పరిష్కారం తక్షణ ప్రాధాన్యతగా పేర్కొన్న ఆయన... తదుపరి బ్యాంకింగ్ విలీన ప్రక్రియపై కేంద్రం దృష్టి సారిస్తుం దన్నారు. చివరకు పోటీపడే పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులు 8 నుంచి పదే ఉంటాయని అన్నారు. మిగిలినవి ‘డిఫరెన్షియేటెడ్’ (నిర్దిష్ట కార్యకలాపాలు నిర్వహించే) బ్యాంకులుగా మిగులుతాయని వివరించారు.

ఇండియన్ సాఫ్ట్‌వేర్ ప్రొడక్ట్ ఇండస్ట్రీ రౌండ్ టేబుల్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌కు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సంస్థల ఏర్పాటు అవసరమన్నారు. ‘‘ప్రస్తుతం 27 ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. మొండిబకాయిల సమస్య పరిష్కారం అయిన తర్వాత, కేవలం 8 నుంచి 10 పోటీ పూర్వక బ్యాంకులే ఉంటాయని నేను భావిస్తున్నాను. వీటిలో కొన్ని  ప్రపంచ స్థాయి బ్యాంకులుగా అవతరించే వీలుంది. మరికొన్ని డిఫెరెన్షియేటెడ్ బ్యాంకులుగా కొనసాగుతాయి’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు