కృష్ణపట్నంలో క్రిబ్కో ఎరువుల ప్లాంటు!

12 Jan, 2015 00:56 IST|Sakshi
కృష్ణపట్నంలో క్రిబ్కో ఎరువుల ప్లాంటు!

రూ.1000 కోట్ల పెట్టుబడికి సన్నాహాలు
న్యూఢిల్లీ: క్రిషక్ భారతీ సహకార సంస్థ (క్రిబ్కో) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వద్ద రూ.1000 కోట్ల పెట్టుబడితో ఫాస్ఫరస్ అండ్ పొటాష్ (పీఆండ్‌కే) ఎరువుల ప్లాంటును  ఏర్పాటుచేయనుంది. ఇప్పటివరకూ యూరియా ప్లాంట్లు మాత్రమే కలిగివున్న తాము  తొలిసారిగాఫాస్ఫరస్, పొటాష్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు క్రిబ్కో ఎండీ ఎన్.సాంబశివ రావు పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్లాంటు ఏర్పాటుకు భూముల్ని కేటాయించిందన్నారు. ప్లాంటు వార్షిక సామర్థ్యం 6 లక్షల టన్నులు ఉంటుందని తెలిపారు. దీన్ని భవిష్యత్తులో రెట్టింపు(12 లక్షల టన్నులు) చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. క్రిబ్కో ఇప్పటికే 22 లక్షల వార్షిక సామర్థ్యమున్న యూరియా ప్లాంటును గుజరాత్‌లోని హజీరాలో ఏర్పాటుచేసింది. అలాగే శ్యాం గ్రూప్ భాగస్వామ్యంతో 10 లక్షల వార్షిక సామర్థ్యమున్న ఒక ప్లాంటు ఉత్తరప్రదేశ్‌లో, మరో ప్లాంటు ఒమన్‌లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు