-

మారుతీ రికార్డుల మోత

1 Aug, 2017 13:07 IST|Sakshi
మారుతీ రికార్డుల మోత
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ఆటో దిగ్గజం మారుతీ సుజుకీ సరికొత్త రికార్డు మోత మోగించింది. జూలై నెలలో కార్ల అమ్మకాల్లో 20.6 శాతం జంప్‌ చేయడంతో మారుతీ సుజుకీ షేర్లు నేటి ట్రేడింగ్‌ సరికొత్త గరిష్టంలో 3 శాతం జంప్‌ చేశాయి. జూలై నెలలో మారుతీ సుజుకీ 1,65,346 యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో గత నెలలో 1,54,001 వాహనాలను దేశీయంగా విక్రయిస్తే, 11,345 యూనిట్లను ఎగుమతి చేసినట్టు తెలిపింది.
 
మారుతీ సుజుకీ ఈ ప్రకటన వెలువరించిన వెంటనే స్టాక్‌ ధర 2.75 శాతం పైకి ఎగిసి, రికార్డు గరిష్టంలో రూ.7920 గా నమోదైంది. దీంతో మార్కెట్‌ విలువ కూడా రూ.2.4 లక్షల కోట్లకు పెరిగింది. యుటిలిటీ వెహికిల్‌ సెగ్మెంట్‌లో ఎర్టిగా, ఎస్‌-క్రాస్‌, విటారా బ్రీజా అమ్మకాలు ఏడాది ఏడాదికి 46.1 శాతం వృద్ధిని నమోదుచేసినట్టు ఈ కార్ల కంపెనీ పేర్కొంది. వీటి తర్వాత కాంపాక్ట్‌ సెగ్మెంట్‌ 19.6 శాతం, మిడ్‌ సైజ్‌ సెగ్మెంట్‌ 17.1 శాతం, మినీ సెగ్మెంట్‌ 14.1 శాతం పైకి ఎగిసినట్టు మారుతీ సుజుకీ తెలిపింది.   
మరిన్ని వార్తలు