2020-21లో వృద్ధిరేటు సున్నా శాతం: మూడీస్

8 May, 2020 17:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో కరోనా  వైరస్ వ్యాప్తి  కారణంగా  ఆర్థిక మందగమనం పరిస్థితుల్లో  దేశీయ వృద్ది రేటు గణనీయంగా పతనం కానుందని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్సీస్‌ శుక్రవారం  ప్రకటించింది. నెగెటివ్ నుంచి భారత్‌ రేటింగ్‌ అవుట్‌లుక్‌ను సున్నాకు తగ్గించేసింది.  కోవిడ్-19  కల్లోలం, లాక్ డౌన్ కారణంగా  2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎటువంటి వృద్ధిని కనబరచదని  వెల్లడించింది. అయితే 2022లో ఇది  6.6 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఆర్థిక లోటు జీడీపీ లో 5.5 శాతానికి పెరుగుతుందని మూడీస్ విశ్లేషకులు శుక్రవారం తెలిపారు. బడ్జెట్ అంచనా ప్రకారం 3.5 శాతం మాత్రమే. గత నెల చివరిలో, మూడీస్ తన క్యాలెండర్ సంవత్సరం 2020 జీడీపీ వృద్ధి అంచనాను 0.2 శాతానికి తగ్గించిన సంగతి విదితమే.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి, మందగించిన ఉద్యోగ కల్పన, బ్యాంకింగేతర రంగాల్లో నెలకొన్న మూల ధన సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉందని అభిప్రాయపడింది.  జీడీపీ తిరిగి అత్యధికస్థాయికి కి పుంజుకోక పోతే బడ్జెట్ లోటును తగ్గించడంలో,  రుణ భారం పెరగకుండా నిరోధించడంలో ప్రభుత్వం కీలక సవాళ్లను  ఎదుర్కొంటుందని మూడీస్  తెలిపింది.  వృద్ధి క్షీణత, ప్రభుత్వ ఆదాయ ఉత్పత్తి, కరోనావైరస్-సంబంధిత ఆర్థిక ఉద్దీపన చర్యలతో  ప్రభుత్వ డెట్ రేషియోలకు దారితీస్తుందనీ, రాబోయే కొన్నేళ్లలో జీడీపీలో 81 శాతానికి పెరుగుతుందని భావిస్తు న్నామని పేర్కొంది. కాగా గత నవంబరులో ఆర్థిక వ్యవస్థ అవుట్ లుక్ ను  ‘నెగటివ్‌’కి చేర్చిన సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే ఆర్థిక వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని  హెచ్చరించింది. (ఎస్‌బీఐ ఉద్యోగికి కరోనా: కార్యాలయం మూసివేత)

మరిన్ని వార్తలు