శాంసంగ్ గెలాక్సీ ఎస్20  సిరీస్ : భారీ ఆఫర్లు

6 May, 2020 12:24 IST|Sakshi

గెలాక్సీ ఎస్ 20 సిరీస్ ఫోన్లపై ఆఫర్లు

రూ.4 వేల  ఇ-వోచర్‌

భారీ తగ్గింపుతో గెలాక్సీ బడ్స్ ప్లస్  

సాక్షి, ముంబై:  లాక్ డౌన్ సడలింపులతో ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించింది. లాక్‌డౌన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది.  గెలాక్సీ ఎస్20  సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ప్రీ బుకింగ్స్‌పై ఇ-వోచర్‌ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాల ఆఫర్  రూ.4 వేల విలువ చేసే వోచర్  అందిస్తున్నట్టు శాంసంగ్  ప్రకటించింది. భారత్‌లో గెలాక్సీ ఎస్20 సిరీస్ కోసం శాంసంగ్ ప్రీబుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ అందుబాటులో వుంచింది.   ఈ వోచర్‌లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ శామ్‌సంగ్.కామ్‌లో లభించే ఇతర గెలాక్సీ ఉత్పత్తుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఈ నెల (మే)  20 వరకు మాత్రమే ఈ ఆఫర్  అందుబాటులో వుంటుంది. 

గెలాక్సీఎస్ 20 ఫోన్లను ప్రీ-బుక్ చేసుకునే కొత్త వినియోగదారులందరికీ శాంసంగ్ గెలాక్సీ బడ్స్ ప్లస్‌‌ను భారీ తగ్గింపుతో అందిస్తోంది. గెలాక్సీ ఎస్ 20ప్లస్, ఎస్ 20 అల్ట్రా ప్రీ-బుకింగ్ చేసుకునే వినియోగదారులకు రూ.11,990 విలువైన గెలాక్సీ బడ్స్ ప్లస్‌‌ను కేవలం రూ.1,999కే పొందవచ్చు. అలాగే గెలాక్సీ ఎస్ 20 ప్రీ-బుకింగ్ వినియోగదారులు గెలాక్సీ బడ్స్ ప్లస్ ను రూ.2,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్‌ను జూన్ 15 లోపు మాత్రమే రిడీమ్ చేసుకోవాల్సి వుంటుంది. వీటితోపాటు కొనుగోలుదారులకు శాంసంగ్ కేర్ + రూ .3,999 విలువైన 1,999  లాంటి ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది.

జూన్ 15 వరకు రిడీమ్ చేసుకునేలా అనేక ఇతర ఆఫర్లను శాంసంగ్ ప్రకటించింది. ‘గెలాక్సీ ఎస్ 20’ని ప్రీ-బుక్ చేసుకునే వినియోగదారులు అప్‌గ్రేడ్ ఆఫర్‌తో అదనంగా  రూ. 5000 బోనస్  అందిస్తోంది. ‘గెలాక్సీ ఎస్ 20’, ‘గెలాక్సీ ఎస్ 20 ప్లస్’, ‘గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా’ ప్రీ-బుకింగ్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.  అంతేకాదు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై  రూ.6 వేల క్యాష్‌బ్యాక్ కూడా లభ్యం.

గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా 
6.9 అంగుళాల  భారీ డిస్ ప్లే, 1440x3200 పిక్సెల్స్ రిజల్యూషన్‌ (ఇన్ఫినిటీ-ఓ డైనమిక్ అమోలెడ్ స్క్రీన్) ,108 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్,48 ఎంపీ టెలిఫోటో, 12 ఎంపీ అల్ట్రావైడ్  టోఫ్ లెన్స్ రియర్ కెమెరా, 40 ఎంపీ సెల్పీ కెమెరా లను అమర్చింది. ముఖ్యంగా ఈ కెమెరాల్లో 100ఎక్స్ సూప‌ర్ రిజ‌ల్యూష‌న్ జూమ్,  ఇంకా 5జీ, ఇన్ డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌,  ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు