దీర్ఘకాల లాక్‌డౌన్ ‌: కుప్పకూలిన మార్కెట్లు

4 May, 2020 16:43 IST|Sakshi

 ఇంట్రా డేలో 2086 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

9300 దిగువకు నిఫ్టీ

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఆరంభం లాభాలనుంచి ఏమాత్రం పుంజుకోని కీలక సూచీలు చివరికి భారీ నష్టాలతో కీలక మద్దతు స్థాయిలకు దిగువన ముగిసాయి. 2002 పాయింట్లు పతనంతో సెన్సెక్స్ 31715వద్ద,  నిఫ్టీ 566 పాయింట్లు  కుప్పకూలి 9293 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్ 32వేల దిగువకు చేరగా, నిఫ్టీ 9300 స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. అలా ఈ నెల డెరివేటివ్ సిరీస్ భారీ నష్టాలతో బోణీ చేసింది.  దీంతో గత నాలుగు రోజుల లాభాలు మొత్తం ఆవిరైపోయాయి. (లాక్‌డౌన్ ‌3.0 : సెన్సెక్స్ ఢమాల్)

ప్రభుత్వం కోవిడ్-19 లాక్‌డౌన్‌ను మరో రెండువారాల పాటు పొడిగించడంతో సూచీలు సోమవారం కుప్పకూలిపోయాయి.పెరుగుతున్నయుఎస్-చైనా ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి. దీంతో  సెన్సెక్స్  ఒక దశలో 2,086 పాయింట్లు లేదా 6 శాతం కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో, మెటల్, రియాల్టీ  షేర్లు బాగా  నష్టపోయాయి. దీర్ఘకాలిక లాక్‌డౌన్ కార్పొరేట్ ఆదాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉందనీ, ఇది ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడిని పెంచుతుందని విశ్లేషకులు తెలిపారు. (లాక్‌డౌన్ ఎఫెక్ట్ : పీఎంఐ రికార్డు కనిష్టం)

మారుతి సుజుకి, బజాజ్ ఆటోలతో సహా పలు ఆటో కంపెనీలు ఏప్రిల్ నెలలో సున్నా అమ్మకాలను సాధించడంతో ఆటో షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్,  యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. నిఫ్టీ 50-బాస్కెట్ హిందాల్కో ఐసిఐసిఐ బ్యాంక్, వేదాంత, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి, జెఎస్‌డబ్ల్యు స్టీల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ కూడా 8-11 శాతం పడిపోయాయి.  (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు)

>
మరిన్ని వార్తలు