ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి

1 May, 2020 10:22 IST|Sakshi

సెన్సెక్స్ 10 సంవత్సరాలలో అతిపెద్ద నెలవారీ లాభం

ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్‌కు నేడు  (శుక్రవారం) సెలవు.మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, సందర్భంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  ట్రేడింగ్ వుండదు. శనివారం, ఆదివారం సాధారణ సెలవు రోజులు. ఈ నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ మార్కెట్‌  సోమవారం(4వ తేది) తిరిగి ప్రారంభమవుతుంది.  ఈ రోజు మే 1 అంతర్జాతీయ కార్మికదినోత్సవంగా కూడా. (‘కరోనా’కు మందు! మార్కెట్‌ ముందుకు...)

పారిశ్రామిక రంగానికి మరో ప్యాకేజీని కేంద్రం ఇవ్వనున్నదన్న అంచనాలు,  లాక్ డౌన్ ఎత్తివేత, ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయన్న అంచనాలకు తోడు గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్ వరుసగా నాలుగవ రోజు సానుకూలంగా ముగిసింది. కోవిడ్-19 చికిత్సలో గిలియడ్ రెమెడిసివిర్ ఔషధం సత్ఫలితాలు ఇస్తోందన్న అమెరికా ప్రకటన, వ్యాక్సిన్‌పై మానవ పరీక్షలను ప్రారంభించడం కూడా ర్యాలీకి ఆజ్యం పోసింది. దీంతో గురువారం  కీలక  సూచీలు భారీగా లాభపడ్డాయి. దీనికితోడు  ఏప్రిల్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో షార్ట్‌ కవరిం, రోల్-ఓవర్లు కూడా లాభాలకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌ 997 పాయింట్ల లాభంతో 33,718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 307 పాయింట్లు ఎగసి 9,860 పాయింట్ల వద్ద ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 57 పైసలు పుంజుకోవడం విశేషం.   (కరోనా : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ, వేతనాల కోత)

కాగా గత తొమ్మిదేళ్లలో ఈ రెండు సూచీలకు ఇది రెండో అత్యధిక వారం లాభం. ఏప్రిల్‌ నెలలో సెన్సెక్స్‌ 13 శాతం, నిఫ్టీ 14 శాతానికి పైగా లాభపడ్డాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 7.6 శాతం,  నిఫ్టీ 7.7 శాతం చొప్పున ఎగిశాయి.  ఒక నెలలో సెన్సెక్స్ 4 వేల పాయింట్లకు పైగా ఎగిసింది.  గత 10 ఏళ్లలో ఇంతగా లాభపడటం ఇదే మొదటిసారని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.  అలాగే ఒక నెలలో నిఫ్టీ ఇంతగా లాభపడటం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అయితే  ఈ స్థాయిల వద్ద కరెక్షన్ కు అవకాశం వుందని, పెట్టుబడి దారులు అప్రమత్తంగా వుండాలని వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సూచించారు.  మార్చి 2020 కనిష్టాల నుండి బలమైన ర్యాలీ తరువాత, మార్కెట్  30వేల స్థాయికి దిగువకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందని పెట్టుబడిదారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలని పేర్కొన్నారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు)

మరిన్ని వార్తలు