ఫోక్స్వాగన్ పోలో కొత్త వెర్షన్ రివీల్

16 Jun, 2017 20:26 IST|Sakshi
ఫ్రాంక్ఫర్ట్ : ఫోక్స్ వాగన్ తన పోలో సబ్ కాంపాక్ట్ కొత్త వెర్షన్ ను ఆవిష్కరించింది. జర్మన్ లోని తన ప్రధాన కార్యాలయం వోల్ఫ్స్ బర్గ్ లో దీన్ని రివీల్ చేసింది. 1975లో తొలిసారి ఈ కారును ఆవిష్కరించారు. ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి 1.4కోట్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఈ కొత్త పోలో, ముందస్తు మోడల్ కంటే పెద్దదిగా ఉంది. కానీ రూఫ్ లైన్ మాత్రం ప్రస్తుతమున్న దానికంటే తక్కువగా ఉంది. సన్నటి గ్రిల్,  పొడవైన ట్విన్-బ్యారెల్ హెడ్ ల్యాంప్స్ ను ఇది కలిగి ఉంది.
 
డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కొత్త సేఫ్టీ ఫీచర్లను ఈ మోడల్ లో ఆఫర్ చేస్తున్నారు.కొత్త సేఫ్టీ ఫీచర్లతో వెనుకవైపు నుంచి జరిగే ప్రమాదాలను 45 శాతం తగ్గించవచ్చని కంపెనీ పేర్కొంది. రియర్ ట్రాఫిక్ అలర్ట్ ను ఇది కలిగి ఉంది. దీని ద్వారా కారును పార్క్ చేసేటప్పుడు వెనుక వైపున్న ట్రాఫిక్ ను తేలికగా గుర్తించవచ్చు. ఐదు డోర్ల హ్యాచ్ బ్యాక్ రూపంలో ఇది వస్తోంది. ఆరు గ్యాస్ ఓలైన్ ఇంజిన ఆప్షన్లు దీనిలో అందుబాటులో ఉన్నాయి. ఒకటి సహజవాయువుకి సంబంధించినది కాగ, మిగతా రెండు డీజిల్, మూడు పెట్రోల్ ఆప్షన్లు. 
 
హ్యుందాయ్ వారి క్రెటా ఎస్‌యువికి ఇది ప్రత్యక్ష పోటీగా నిలవనున్నట్టు తెలుస్తోంది..  ఈ ఏడాది చివరి నుంచి యూరోపియన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్న ఈ కారు బేస్ ధర జర్మనీలో 12,975 యూరోలు అంటే రూ.9,35,057 వరకు ఉండొచ్చని అంచనా. అయితే ఈ వాహనం అమెరికా మార్కెట్ కు అందుబాటులోకి రావడం లేదు. 
 
మరిన్ని వార్తలు