షావోమి బిగ్‌ సర్‌ప్రైజ్‌.. బంపర్‌ ఆఫర్‌ కూడా

19 Mar, 2019 13:21 IST|Sakshi

గూగుల్‌ పే, వాట్సాప్‌ పే, పేటీఎంకు పోటీగా రంగంలోకి

 డిజిటల్‌  వ్యాలెట్‌ 'ఎంఐ పే'  రిలీజ్ చేసిన షావోమీ 

సాక్షి, న్యూఢిల్లీ:  స్మార్ట్‌ఫోన్‌ రంగంలో సంచనాలను నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి ఇపుడిక డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గూగుల్‌ పే, పేటీఎం తరహాలో  తన పేమెంట్‌ యాప్‌ ఎంఐపేను లాంచ్‌ చేసింది. ఇండియాలో 'ఎంఐ పే' యూపీఐ సర్వీస్ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.  

డేటా లీక్‌ పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అత్యధిక  భద్రమైన సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది. యూజర్ల డేటాను ఇండియాలో మాత్రమే స్టోర్ చేస్తామని షావోమీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)  క్లియరెన్స్‌ అనంతరం  'ఎంఐ పే'  యాప్‌ను  అధికారికంగా తీసుకొచ్చింది. ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు.

యూజర్లకు ఆఫర్లు
ఎంఐ పే యాప్ యూజర్లకు మరో బంపర్‌ఆఫర్‌ కూడా ప్రకటించింది.  వినియోగదారులు రెడ్‌మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షావోమీ ప్రకటించింది. 

ఇప్పటికే చైనాలో వినియోగంలో ఉన్న  ఈ వ్యాలెట్‌ సర్వీసును  ఇండియన్ యూజర్ల కోసం   ఆవిష్కరించింది.  కొద్ది రోజుల క్రితం ఇండియాలో 'ఎంఐ పే' బీటా వర్షన్ రిలీజ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు