ట్రక్‌ బోల్తా, ఆరుగురు దుర్మరణం

16 May, 2020 13:59 IST|Sakshi

భోపాల్‌: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మరవకముందో మధ్యప్రదేశ్‌ మరో విషాదం చోటుచేసుకుంది. ట్రక్కు అదుపు తప్పి బోల్తాపడటంతో ఆరుగురు వలస కూలీలు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. వీరంతా మహారాష్ట్ర నుంచి వస్తుండగా సాగర్‌ జిల్లా సమీపంలో శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.  గాయపడినవారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహన్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు చేకూరాలంటూ, బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ('తినడానికి తిండి లేదు.. నడిచేందుకు ఓపిక లేదు')

కాగా ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ తెల్లవారుజామున వలస కూలీల ట్రక్కును మరో ట్రక్కు కొట్టడంతో 24 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా పొట్ట చేతపట్టుకుని వేరే రాష్టాలకు వెళ్లిన వలస కూలీలు. వీళ్లు ప్రయాణిస్తున్న  ట్రక్కు రాజస్థాన్ నుంచి యూపీ వస్తుండగా ఔరాయ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన 36 మంది వలస కూలీలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (24 మంది కూలీల మృతి : ప్రధాని దిగ్భ్రాంతి)

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పనులు లేకపోవడంతో వలస కూలీలు తమ స్వస్థలాలకు తరలి వెళుతున్నారు. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వారంతా వందల కిలోమీటర్లు కాలినడకన బయల్దేరారు. 24 గంటల్లో జరిగిన రోడ్డు ప‍్రమాదాల్లో 31మంది వలస కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గత వారం రోజులుగా జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో  50మంది వరకూ మృత్యువాత పడ్డారు. (మమ్మల్ని పట్టించుకోవడం లేదు..)

మరిన్ని వార్తలు