చిన్నారిపై లైంగిక దాడి

1 Aug, 2019 12:07 IST|Sakshi

మైలార్‌దేవ్‌పల్లి: కుటుంబ తగాదాలతో కక్షగట్టిన ఓ యువకుడు వరసకు మరదలయ్యే మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా  మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం కాటేదాన్‌కు వలస వచ్చి స్థానిక శాంతినగర్‌లో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె తన పెద్దకూతురును మేనల్లుడైన రాజుకు ఇచ్చి మూడేళ్ల క్రితం వివాహం చేసింది.

అల్లుడు, కూతురు కూడా మహిళ ఇంటికి సమీపంలోనే ఉంటున్నారు. ఆమె చిన్నకూతురు శాంతినగర్‌ అంగన్‌వాడీ పాఠశాలలో చదువుకుంటోంది. అయితే, మంగళవారం రాజు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి తన చిన్న మరదలను వెంట తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి సాయంత్రం అత్త ఇంటి వద్ద వదిలేశాడు. విషయాన్ని గమనించిన బాలిక తల్లి పోలీసులకు సమాచారం అందించింది. అయితే, కొంతకాలంగా రాజు అత్తతో గొడవపడుతున్నాడు. ఇటీవల పనికి వెళ్లకుండా మద్యానికి బానిసై ఇంటి వద్దే ఉంటున్నాడు. నిత్యం భార్యతో గొడవపడుతూ తల్లి వద్ద నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఈక్రమంలో కుటుంబ కలహాల నేపథ్యంలో రాజు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యగౌడ్‌ తెలిపారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చైన్‌స్నాచర్లపై తిరగబడ్డ మహిళలు 

ప్రణయ్‌ కేసులో నిందితుడిని గుజరాత్‌కు..

సుల్తాన్‌పూర్‌లో దొంగల బీభత్సం 

అంతు చిక్కని ఆయుధ రహస్యం!

మద్యానికి బానిసై చోరీల బాట

ఉసురు తీసిన ‘హైటెన్షన్‌’

పుట్టిన రోజు షాపింగ్‌కు వెళ్లి..

అదనపు కట్నం.. మహిళ బలవన్మరణం

దారుణం : స్నేహితులతో కలిసి సోదరిపై..

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని..

మూడేళ్ల చిన్నారి తల, మొండెం వేరు చేసి..

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

వివాహిత ఊహాశ్రీ అదృశ్యంపై పలు అనుమానాలు

ఉరికి వేలాడిన నవ వధువు..

వివాహేతర సంబంధంతో మహిళ హత్య

క్యూనెట్‌ బాధితుడు అరవింద్‌ ఆత్మహత్య

ఒక్క కేసు; ఎన్నో ట్విస్ట్‌లు!

భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని..

రాయ్‌బరేలీ ప్రమాదంలో 25 మందిపై కేసు

గుండాల ఎన్‌కౌంటర్‌.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..

హైదరాబాద్ జీడిమెట్లలో మరో కిడ్నాప్ కలకలం..! 

తండ్రి పోలీసు.. కొడుకు హంతకుడు

క్రికెట్‌లో గొడవ.. కత్తెరతో పొడిచి హత్య

తలాక్‌ చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..