ఐఐఏ అందిస్తున్న కోర్సుల వివరాలు..

6 Mar, 2014 13:08 IST|Sakshi

టి. మురళీధరన్
 టి.ఎం.ఐ. నెట్‌వర్క్
 
 
 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ) అందిస్తున్న కోర్సుల వివరాలు తెలపండి?
 - రఘు, మచిలీపట్నం.
 ఇగ్నో భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ (ఐఐఏ- బెంగళూరు).. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ+పీహెచ్‌డీ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఈ కోర్సు ఫిజిక్స్, ఆస్ట్రో ఫిజిక్స్ సబ్జెక్టులలో అందుబాటులో ఉంది. ఈ కోర్సులో చేరేందుకు సైన్స్ లేదా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎంట్రన్స్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
 
 ఐఐఏ.. ఆస్ట్రనామికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఎంటెక్+ పీహెచ్‌డీ (టెక్) కోర్సును అందిస్తోంది.
 అర్హత: ఆప్టిక్స్ అండ్ ఆప్టో ఎలక్ట్రానిక్స్ లేదా రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్. ఫిజిక్స్/ఎలక్ట్రానిక్ సైన్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ అప్లయిడ్ ఫిజిక్స్‌లో ఎంఎస్సీ పూర్తిచేసిన వారు కూడా అర్హులు.
 ఐఐఏ.. ప్రత్యేకంగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.iiap.res.in
 
 
 
 జిప్‌మర్- పుదుచ్చేరి.. అందిస్తున్న కోర్సుల వివరాలు తెలియజేయండి?
 - భవాని, నల్గొండ.
 జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్‌మర్) వివిధ రకాల కోర్సులను అందిస్తోంది.
 
 బీఎస్సీ: నర్సింగ్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, మెడికల్ రేడియో థెరఫీ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, పెర్‌ఫ్యూజన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ, న్యూరో టెక్నాలజీ, కార్డియాక్ లేబొరేటరీ టెక్నాలజీ.
 అర్హత: బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2.
 పోస్ట్ బీఎస్సీ (నర్సింగ్): క్రిటికల్ కేర్ నర్సింగ్, కార్డియాక్ థొరాసిక్ నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ నర్సింగ్, అంకాలజీ నర్సింగ్, నియోనటల్ నర్సింగ్. ఈ కోర్సులను ఏడాది కాల వ్యవధితో అందిస్తున్నారు.
 ఎంఎస్సీ: మెడికల్ బయోకెమిస్ట్రీ, ఎంఎల్‌టీ-మైక్రోబయాలజీ, మెడికల్ బయోమెట్రిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎంఎల్‌టీ సైటో పాథాలజీ, మెడికల్ ఫిజియాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్ కోర్సు, చైల్డ్ హెల్త్ నర్సింగ్ వంటి కోర్సులున్నాయి.
 మెడికల్ రికార్డ్ ఆఫీసర్, మెడికల్ రికార్డ్ ట్రైనీ, పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ మేనేజ్‌మెంట్, బ్లడ్ బ్యాంకింగ్ టెక్నాలజీ వంటి స్పాన్సర్డ్ లేదా సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 ప్రవేశాలు: ఉమ్మడి ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
 వెబ్‌సైట్:jipmer.edu.in
 
 
 ఇంజనీరింగ్ ఫిజిక్స్‌లో బీటెక్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలియజేయండి?
 - వంశీ, వరంగల్.
 సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ప్రక్రియలో ఇమిడియున్న ఫిజిక్స్..ఇంజనీరింగ్ ఫిజిక్స్. ఇది ప్రత్యేకించి ఒక బ్రాంచ్‌కు మాత్రమే పరిమితం కాదు. అప్లయిడ్ ఫిజిక్స్ భావనలు విభిన్న అంశాల్లో పరిశోధనలకు ఉపయోగపడతాయి.
 
 కోర్సుల వివరాలు:
 ఐఐటీ, ఢిల్లీ.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+ 2. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. కోర్సు కరిక్యులంలో ఫిజికల్ కెమి స్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఆఫ్ మెటీరియల్స్, కంప్యూటర్ సైన్స్, మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీసెస్, గ్రాఫిక్ సైన్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్ తదితర అంశాలుంటాయి.
 వెబ్‌సైట్: physics.iitd.ac.in
 ఐఐటీ, బాంబే.. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 వెబ్‌సైట్: www.phy.iitb.ac.in

మరిన్ని వార్తలు