ఐఐటీలకు దీటైనవెన్నో..

30 Apr, 2016 14:05 IST|Sakshi
ఐఐటీలకు దీటైనవెన్నో..

గెస్ట్ కాలమ్
జేఈఈ మెయిన్ ఫలితాలు, ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ వంటి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల నేపథ్యంలో... ఐఐటీలు, అప్టిట్యూట్ టెస్ట్, ఇంజనీరింగ్ విద్య  తదితర అంశాలపై ప్రొఫెసర్ సరిత్ కుమార్‌తో గెస్ట్‌కాలం..

 
* ఐఐటీల్లో ప్రవేశానికి సంబంధించి తాజాగా ప్రతిపాదించిన స్టాండర్డయిజ్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. విద్యార్థుల్లో ఇంజనీరింగ్ విద్య పట్ల ఉన్న వాస్తవ అభిరుచి,  ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన సహజ నైపుణ్యాలను గుర్తించడం. దాంతోపాటు కోచింగ్ సంస్కృతికి స్వస్తి పలకడం. ప్రస్తుతం అమలవుతున్న విధానం వల్ల విద్యార్థులు కోచింగ్ ద్వారా పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటీల్లో అడుగు పెడుతున్నారు. ఐఐటీల్లో చేరాక అక్కడి వాతావరణంలో ఇమడలేక ఒత్తిడికి గురవుతున్నారు.  
* ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన విద్యార్థులకు.. ఇంజనీరింగ్ కోర్సుల్లో రాణించేందుకు అవసరమైన బేసిక్స్‌ను పరీక్షించేందుకు సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో విజయం సాధించిన విద్యార్థులు... కోచింగ్‌తో సంబంధం లేకుండా సింగిల్ ఎంట్రన్స్‌లో రాణించగలరని ఐఐటీ నిపుణుల కమిటీ గట్టిగా నమ్ముతోంది.
* విద్యార్థుల్లో అధిక శాతం మంది గమ్యం ఐఐటీలే!కానీ ఐఐటీల్లో సీట్ల సంఖ్య పరిమితం.. పోటీ మాత్రం అపరిమితం. కాబట్టి విద్యార్థులు ముందు నుంచే ఐఐటీలకు ప్రత్యామ్నాయ మార్గాలపైనా దృష్టిపెట్టాలి. ఐఐటీలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించే ఇన్‌స్టిట్యూట్స్ ఎన్నో దేశంలో ఉన్నాయి. అంతేకానీ ఐఐటీలో సీటు రాలేదని కుంగిపోకూడదు.
* ఇంజనీరింగ్‌లో చేరే  విద్యార్థులు  క్యాంపస్‌లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే లక్ష్యం దిశగా కృషి చేయాలి. ఇంజనీరింగ్‌లో చేరడమే విజయం కాదని.. తమ లక్ష్యం పూర్తి స్థాయిలో సాధించాలంటే నాలుగేళ్ల  కోర్సులో రోజూ రాణించడం ముఖ్యమని గుర్తించాలి.
 
ప్రాక్టికాలిటీతో పర్‌ఫెక్షన్
ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. బోర్డ్ సిలబస్ తరహాలో క్లాస్ రూం లెర్నింగ్‌కు, లెక్చరర్స్‌పై ఆధారపడటం అనే ఆలోచనకు స్వస్తి పలకాలి. ప్రాక్టికల్ అప్రోచ్‌ను పెంపొందించుకోవాలి. తరగతి గదిలో ప్రొఫెసర్ ఒక కాన్సెప్ట్ చెబితే దానికి సంబంధించి మరింత లోతుగా అధ్యయనం చేయాలి.
- ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్
డైరెక్టర్, ఐఐటీ - రోపార్

>
మరిన్ని వార్తలు