ఇప్పటికి ఒకటయ్యాయి

11 Apr, 2020 11:02 IST|Sakshi
ఇంగ్‌ ఇంగ్, లె లె

మనుషుల సంచారం లేకపోవడంతో ‘జూ’లో జంతువులు కూడా ఉల్లాసంగా ఉంటున్నాయి. హాంకాంగ్‌లోని ‘ఓషన్‌ పార్క్‌’ జూ లో.. పదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కనాడూ కలవని ఇంగ్‌ ఇంగ్, లె లె అనే పాండాల ఆడామగ జంట ఈ లాక్‌డౌన్‌ లో తమంతట తామే కలవడం జూ సంరక్షణ అధికారులకు గొప్ప సంతోషకరమైన విషయం అయింది. పద్నాలుగేళ్ల వయసున్న పాండాలవి. ఈడూజోడుగా ఉన్నా ఏనాడూ ఒకదానిలో ఒకటి తోడు వెతుక్కోడానికి అవి ఆసక్తి చూపలేదట. ఇన్నాళ్లకు వాళ్ల కల ఫలించింది. పాండాల జీవిత కాలం ఇరవై ఏళ్ల వరకు ఉంటుంది. ఇంగ్‌ ఇంగ్, లె లె.. జీవితం మొత్తం ఇలాగే నిస్సారంగా, నిర్లిప్తంగా ఉండిపోతాయేమోనని అనుకున్న అధికారులకు వాటి కలయిక ఊహించని వరమే.

మరిన్ని వార్తలు