‘ఉపాధి’ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు

29 Jan, 2017 00:37 IST|Sakshi

11 వేల వంటగదులు, 7 వేల మరుగుదొడ్ల నిర్మాణం: నీతూ ప్రసాద్‌

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వెచ్చించాలని సర్కారు నిర్ణయించింది. 30 జిల్లాల్లోని (హైదరాబాద్‌ మినహా) ప్రభుత్వ పాఠశాలన్నింటిలో 11,080 వంట గదులు, 7,080 మరుగుదొడ్లు అవసరమన్న ప్రతిపాద నలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆ శాఖ కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌ వెల్లడించారు. 

వీటితో పాటు నీటి వసతి కోసం బోరు, మోటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ, గ్రామపంచాయతీ భవనాలను నెలలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణా భివృద్ధి శాఖలో సిబ్బంది కొరత ఉందని పలువురు తెలుపగా, దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటానన్నారు.

మరిన్ని వార్తలు