పేదలను పట్టించుకునే నేతలు రావాలి

1 Feb, 2016 02:46 IST|Sakshi
పేదలను పట్టించుకునే నేతలు రావాలి

కామన్ మ్యాన్ Voice
 
నగరంలో ప్రతి కాలనీలోను ప్రతి అపార్ట్‌మెంట్‌కు వీరే బాస్‌లు. బతుకులు మాత్రం అంతంతే. పెద్ద భవంతుల కింద ఉన్న చిన్న గదిలో బతుకు బండి లాగించడం ప్రతిచోటా క నిపించే దృశ్యాలు. ఏళ్ల తరబడి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న తమ లాంటివారి సంక్షేమం కోసం నేతలు ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదని అవేదన వ్యక్తం చేస్తున్నాడు రాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేసే వాచ్‌మెన్ బి.రమేష్. ‘కనీసం మ్మలను అసంఘటిత రంగ కార్మికులుగా కూడా గుర్తించడం లేదు.

నిత్యం అపార్ట్‌మెంట్‌లో నివసించే వారు భద్రంగా ఉండాలని పనిచేసే మా లాంటివారి బతుకులకు భరోసా కల్పించే ందుకు నేతలు ఆలోచించాలి. కనీస వేతనాలు లేకుండా ఈ పనిచేస్తూ భార్యాబిడ్డలతో బతుకుతున్నాం. మా ఇంట్లో మహిళలు ఇళ్లల్లో పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప మాకు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా పోయాయి’ అని పేర్కొన్నాడు.
 - అంబర్‌పేట

మరిన్ని వార్తలు