అంగారకుడు.. అలా వచ్చి ఇలా వెళ్లాడు!

24 Jul, 2014 00:53 IST|Sakshi
అంగారకుడు.. అలా వచ్చి ఇలా వెళ్లాడు!

భూమికి పొరుగు కక్ష్యలోనే తిరుగుతున్న అంగారకుడు.. భూగ్రహానికి ఎదురుగా వ స్తున్నప్పుడు.. వెళ్లిపోతున్నప్పుడు తీసిన అద్భుత ఫొటోలివి. ఏప్రిల్ 8న భూమికి అతిసమీపంలోకి వచ్చిన సందర్భంగా అంగారకుడు ఆకాశంలో మిరుమిట్లు గొలిపే ప్రకాశంతో మెరిసిపోయాడు. ఒక పెద్ద చుక్క మాదిరిగా మామూలు కంటికి కూడా బాగా కనిపించి కనువిందు చేశాడు. అయితే ఖగోళ చిత్రాలను తన కెమెరాలో బంధించేందుకు ఎంతో ఆసక్తిచూపే లియో ఆరెట్స్ అనే ఫొటోగ్రాఫర్ అరుణగ్రహాన్ని ఇలా చకచకా క్లిక్‌మనిపించాడు.
 
 అయితే ఇవన్నీ ఒక్కరోజులో తీసినవి కాదండోయ్.. గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకూ 8 నెలల కాలంలో తీశాడు. అన్నింటినీ కలిపి.. ఆ గ్రహం ఏయే నెలలో ఎక్కడెక్కడ ఎలా ఉందో చూపుతూ ఈ ఫొటోను రూపొందించాడు. ఫొటోలో కుడి నుంచి ఎడమకు వరుసగా ఉన్న వాటిలో తొలి రెండు గతేడాది అక్టోబర్, డిసెంబర్‌లో తీసిన చిత్రాలు కాగా.. ఆ తర్వాత ఉన్న మిగతావి వరుసగా ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 10, ఏప్రిల్ 5, 10, 16, మే 3, 19, 30, జూన్ 11, 21 తేదీలలో తీసిన ఫొటోలు. ఏప్రిల్ 8న ఆకాశంలో పెద్ద చుక్కగా కనిపిస్తున్న అంగారకుడిని కూడా అంతరచిత్రంలో చూడొచ్చు. అన్నట్టు... అంగారకుడు మన భూమికి ప్రతి 26 నెలలకు ఓ సారి ఎదురుగా వస్తాడు.

మరిన్ని వార్తలు