వైరల్‌: సోదరి కోసం చిన్నారి.. నువ్వు గ్రేట్‌!

25 May, 2020 16:11 IST|Sakshi

తోడబుట్టిన తోడు కురిపించే ప్రేమ, పంచే స్నేహితం, చూపే ఆప్యాయత, ఆదరణకు మరెవరూ సాటిరారనడంలో అతిశయోక్తి లేదు. అమ్మానాన్నల తర్వాత అంతటి ప్రేమ లభించేది తోబుట్టువుల దగ్గరే. కొట్టుకున్నా, తిట్టుకున్నా సరే అక్క/చెల్లి ఇబ్బందుల్లో ఉందంటే పరిగెత్తుకు వచ్చే సోదరులు ఎంతో మంది ఉంటారు. అలాంటి స్వచ్చమైన బంధానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచాడు ఓ బుడ్డోడు. దివ్యాంగురాలైన సోదరి కళ్లల్లో సంతోషం చూసేందుకు అతడు చేసిన పని నెటిజన్ల మనసు దోచుకుంటోంది.(‘ఉస్సెన్‌ బోల్ట్‌ కూడా నన్ను పట్టుకోలేడు’)

బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోలో.. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఓ బాలిక బాస్కెట్‌లో బాల్‌ వేసేందుకు ప్రయత్నించింది. కానీ తనకు అది సాధ్యం కాకపోవడంతో ఎదురుగా ఉన్న ఆమె సోదరుడు.. బాస్కెట్‌ను దగ్గరగా తీసుకువచ్చాడు. అతికష్టం మీద ఆ బాలిక అందులో బాల్‌ను వేయగా.. చప్పట్లు కొడుతూ ఆ బుడ్డోడు తన సోదరిని ఉత్సాహపరిచాడు. 14 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 20 లక్షల మందికి పైగా వీక్షించగా.. లైకులు, రీట్వీట్లతో వైరల్‌ అవుతోంది. ఈ క్రమంలో సదరు పిల్లాడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ప్రతీ అక్కాచెల్లికి నీ లాంటి సోదరుడు ఉండాలి. తోబట్టువు మోముపై చిరునవ్వు కోసం నువ్వు పడిన తాపత్రయం కంటతడి పెట్టించింది. అయితే అవి ఆనంద భాష్పాలు. నువ్వు గ్రేట్‌’’ అంటూ చిన్నోడిని ఆశీర్వదిస్తున్నారు.(వైరల్‌.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!)

మరిన్ని వార్తలు