కరోనాతో తగ్గిన గుండె జబ్బులు

8 Apr, 2020 18:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో రోజురోజుకు కరోనా వైరస్‌ కేసులు పెరుగుతుంటే మరో పక్క గుండె జబ్బు కేసులు గణనీయంగా తగ్గడం పట్ల అమెరికా వైద్య వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. హృద్రోగుల కేసులు 40 నుంచి 60 శాతం తగ్గినట్లు ట్విటర్‌ ద్వారా అధ్యయనం జరిపిన ‘ఆంజియోప్లాస్టీ. ఆర్గ్‌’ తెలియజేసింది. కరోనా భయాందోళనల వల్ల గుండె జబ్బుల కేసులు పెరుగుతాయనుకున్నామని, ఇలా తగ్గుతాయని అనుకోలేదని వైద్యాధికారులు చెప్పారు. (11 సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్)

ఆస్పత్రులకు వెళితే కరోనా వైరస్‌ బారిన పడతామనే భయందోళనల వల్ల ఇంటి వద్దనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ ఉండిపోవడం లేదా కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తర్వాత వెళదామనుకొని ఇంటి ఉండిపోవడం లేదా కరోనా సందర్భంగా స్వీయ నిర్బంధంలో ఉండడం వల్ల ఎక్కువ తాగక పోవడం, ఎక్కువగా తినక పోవడం వల్ల గుండె జబ్బులు తగ్గి ఉండవచ్చు. ఈ మూడింటిలో ఏదైనా జరిగి ఉండవచ్చని అమెరికా వైద్యాధికారులు భావిస్తున్నారు. (క్లోరోక్విన్.. మాకూ ఇవ్వండి)

కరోనా కారణంగా హాంకాంగ్‌లో కూడా ఆస్పత్రికి వచ్చే హృద్రోగుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ‘సర్కులేషన్‌: కార్డియోవాస్కులర్‌ క్వాలిటీ అండ్‌ అవుట్‌కమ్స్‌ పత్రికలో అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. హృద్రోగులు ఆస్పత్రులకు వెళ్లకుండా జాప్యం చేస్తుండవచ్చని వారు అభిప్రాయపడ్డారు. అయితే గుండె జబ్బుల విషయంలో జాప్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే స్పెయిన్‌ దేశంలో అంతకుముందు డేటాతో పోల్చి చూస్తే ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి ఒకటవ తేదీ మధ్య ఎమర్జెన్సీకి వచ్చే గుండె జబ్బుల కేసులు 40 శాతం తగ్గాయని ‘రెక్‌: ఇంటర్‌వెన్షనల్‌ కార్డియాలోజి’ పత్రికలో ప్రచురించిన ఓ నివేదిక వెల్లడించింది. (మోదీ చాలా గొప్పవారు.. మంచివారు: ట్రంప్)

మోతాదుకు మించి తినడం, తాగడం వల్లనే గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయని, స్వీయ నిర్బంధంలో తినడం, తాగడం తగ్గడం వల్ల, ఏమీ తోచక లేదా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తి కోసం వ్యాయామం చేయడం వల్ల కూడా గుండె జబ్బుల కేసులు తగ్గవచ్చని ‘యాలే న్యూ హెవన్‌ హాస్పిటల్‌ సెంటర్‌ ఫర్‌ అవుట్‌కమ్స్‌ రిసర్చ్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌’లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్న డాక్టర్‌ హార్లాన్‌ క్రుమ్‌హోల్జ్‌ విశ్లేషించారు. ( దేశాలకు కరోనా ముప్పు తక్కువేనా!?)

మరిన్ని వార్తలు