పుతిన్‌ రక్షణకు ‌ భారీ టన్నెల్‌ ఏర్పాటు

17 Jun, 2020 10:49 IST|Sakshi

మాస్కో : రష్యాలో కరోనా వైరస్విజృంభిస్తున్న వేళ ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వైరస్‌ బారీన పడకుండా ఉండేందుకు ప్రత్యేకమైన డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టన్నెల్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐఏ అనే వార్త సంస్థ తన రిపోర్టులో నివేదించింది. ఈ మేరకు అక్కడి భద్రతా అధికారులు రక్షణా చర్యలు చేపట్టారు. ఎవరైనా సరే పుతిన్‌ నివాసం ఉంటున్న భవనానికి  రావాలంటే డిస్‌ఇన్‌ఫెక్షన్‌ టనెల్‌ మార్గం ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.  పెన్జా పట్టణానికి చెందిన రష్యన్ కంపెనీ ఈ టన్నెల్‌ను తయారుచేసింది.(భారత్‌: 24 గంటల్లో 2003 కరోనా మరణాలు)

దీనిని మాస్కోలో ఉన్న పుతిన్‌ అధికారిక భవనం నోవో-ఒగారియోవో ముందు ఏర్పాటు చేశారు. పుతిన్‌ను కలవడానికి వచ్చే సందర్శకులు ప్రత్యేక సొరంగ మార్గం ద్వారా లోపలికి ప్రవేశించాల్సి ఉంటుందని తెలిపారు. సొరంగ మార్గంలో ఏర్పాటు చేసిన సీలింగ్, ప‌క్క‌ల నుంచి క్రిమిసంహారక మందును పిచికారి చేస్తారు. దీంతో పాటు టెన్నెల్‌లో సీసీటీవీ ఏర్పాటు చేశారు. రష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు 5,29,000 కేసులు న‌మోదు అయ్యాయి.  ప్ర‌పంచంలో మూడ‌వ స్థానంలో ఉన్న ర‌ష్యాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా వ‌ల్ల 7284 మంది మ‌ర‌ణించారు
(బీజింగ్‌లో 1255 విమానాలు రద్దు)

మరిన్ని వార్తలు