స్వీయ నిర్బంధం‍లోకి సనా మారిన్

23 Apr, 2020 19:25 IST|Sakshi

హెల్సింకీ : మహమ్మారి కరోనా వైరస్‌ భయం ఫిన్లాండ్‌ ప్రధాని సనా మారిన్‌ను వెంటాడుతోంది. ప్రధాని కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తి కరోనా సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా ప్రధాని మారిన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అంతేకాకుండా ప్రధాని కార్యాలయంలోని చాలామంది సిబ్బంది కూడా నిర్బంధంలోకి వెళ్లారు. దీంతో మారిన్‌ ఇంటి నుంచే తన కార్యక్రమాలను కొనసాగిస్తారని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. (వుహాన్‌’ డైరీలో సంచలన విషయాలు)

ఇక ఫిన్లాండ్‌ దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4284 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 172 మంది మృత్యువాత పడ్డారు. కాగా 34 ఏళ్ల సనా మారిన్ ప్రపంచంలో ప్రధాని పదవి చేపట్టిన అతి చిన్న వయస్కురాలిగా చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. మొత్తం మహిళల సారథ్యంలోనే గల ఐదు పార్టీల వామపక్ష కూటమికి సనా మారిన్ సారథ్యం వహిస్తారు.

మరిన్ని వార్తలు