ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్

20 Jan, 2016 11:14 IST|Sakshi
ఐఎస్ ఉగ్రవాదుల జీతాలు కట్

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో పనిచేసే ఫైటర్ల జీతాల్లో కోతపడనుంది. ఫైటర్ల జీతాలను సగానికి తగ్గించాలని ఐఎస్ ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. అనూహ్య పరిణామాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. అయితే కారణాలేంటన్నది బయటపెట్టలేదు. ఆర్థిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. జెరూసలెం పోస్ట్ ఈ వివరాలను వెల్లడించింది.

ఇటీవల ఇరాక్లోని మెసుల్ నగరంలో ఐఎస్ సంస్థ ఖజానాపై అమెరికా సారథ్యంలోని సేనలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో లక్షలాది డాలర్లు కాలిపోయాయి. ఈ నేపథ్యంలో ఫైటర్ల జీతాలు తగ్గించడంతో పాటు పన్నుల ద్వారా స్థానిక పౌరుల నుంచి నిధులు వసూలు చేయాలని ఐఎస్ నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్తో పోలిస్తే ఐఎస్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు జెరూసలెం పోస్ట్ పేర్కొంది.
 

మరిన్ని వార్తలు