కుక్క‌తో లైవ్ టెలికాస్ట్ చేసిన జ‌ర్న‌లిస్ట్‌

8 Apr, 2020 19:52 IST|Sakshi

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా మ‌హమ్మారి విస్త‌రిస్తున్న వేళ అనేక దేశాలు లాక్‌డౌన్ విధించుకున్నాయి. అందులో భాగంగా ప్ర‌జ‌లెవ‌రూ బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని స్ప‌ష్ట‌మైన ఆదేశాలిచ్చాయి. మ‌రోవైపు ఉద్యోగులకు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ వెసులుబాటు క‌ల్పించాయి. అయితే ఇంట్లో నుంచే ప‌నులు చేయ‌డం అంద‌రికీ అంత సులువు కాదని నిరూపించిందీ సంఘ‌ట‌న‌. మైక్ స్లిఫ‌ర్ అనే జ‌ర్న‌లిస్ట్ ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నాడు. వాతావ‌ర‌ణ స్థితిగ‌తుల గురించి చెప్తూ ఉండ‌గా.. అత‌ని కుక్క పిల్ల వ‌చ్చి ప‌క్క‌నే నిల‌బ‌డింది. అత‌ను వార్త‌లు చెప్ప‌డం పూర్త‌వ‌గానే కెమెరా వైపు సంతోషంగా చూసింది. దీనికి సంబంధించిన క్లిప్పింగ్‌ను మైక్ ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. (ప్లాన్‌ అదిరింది కానీ, బెడిసి కొట్టింది!)

దీంతో నెటిజ‌న్లు ఆ వీడియోకు ఫిదా అయిపోయారు. కుక్క‌పిల్ల అచ్చంగా న‌వ్విన‌ట్లే ఉంద‌ని అబ్బుర‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో త‌న కుక్క‌పిల్ల‌తో క‌లిసి చేసిన వార్త‌ల‌కు ఎంత రేటింగ్ ఇస్తార‌ని ట్వీట్ చేయ‌గా ప‌దికి ప‌దిచ్చినా త‌క్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే జ‌ర్న‌లిస్టుల‌కు ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వ‌డం కొత్తేమీ కాదు. జ‌ర్న‌లిస్ట్ లైవ్ రికార్డింగ్ చేస్తుండ‌గా అత‌ని తండ్రి చొక్కా లేకుండా తిర‌గ‌డం, ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్టు వార్త‌లు చెప్తున్న స‌మ‌యంలో పిల్ల‌లు ప‌దేప‌దే అంత‌రాయం క‌లిగించ‌డం వంటి ఎన్నో న‌వ్వు తెప్పించే సంఘ‌ట‌ను ఇదివ‌ర‌కే చూశాం. (క్లోరోక్విన్‌.. మాకూ ఇవ్వండి)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు