మనుషులు లేకుండా ఏమి హాయిలో అలా

17 Apr, 2020 20:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనుషుల అలికిడి లేకపోతే ఏమీ హాయిలో ఇలా.. .అనుకొని గుర్రుకొట్టి నిద్రపోతున్నాయి సింహాలు. దక్షిణాఫ్రికాలోని క్రుగర్‌ నేషనల్‌ పార్కులో పార్క్‌ రేంజర్‌ రిచర్డ్‌ సోవ్రీకి బుధవారం మధ్యాహ్నం కనిపించిన దశ్యం. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలను సష్టిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి నియంత్రించడంలో భాగంగా మార్చి 26వ తేదీ నుంచి దక్షిణాఫ్రికాలో లాక్‌డౌన్‌ పాటిస్తుండడంతో మనుషుల రాకపోకలకు లేక బోసి బోయిన నేషనల్‌ పార్క్‌ రోడ్డు. ఈ పార్కులోని సింహాలు, పులులు తరచుగా ఈ తారు రోడ్డును దాటుకుంటూ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళతాయి కానీ ఈ రోడ్డు మీద అడ్డంగా పడుకోవడం ఎప్పుడూ చూడలేదని ఫార్క్‌ రేంజర్‌ తెలిపారు.

కానీ శీతాకాలం రాత్రులు అడవిలో కాకుండా ఇలా రోడ్డు మీద పడుకుంటాయని తెలుసుకానీ, మిట్టమధ్యాహ్నం ఇలా పడుకోవడం విశేషమని ఆయన చెప్పారు. మనుషులు వాహనాల్లో ఈ రోడ్డు గుండా వెళ్లడం అక్కడి సింహాలకు బాగా అలవాటేనని, మనుషులు నడిచి రావడం మాత్రం వాటికి తెలియదని, అలా నడిచి వాటి వద్దకు వెళ్లేందుకు మనుషులు ప్రయత్నిస్తే కీడు శంకించి అవి పీక్కు తింటాయని పార్క్‌ రేంజర్‌ మీడియాకు వివరించారు. మీడియాతో ఫొటోలను షేర్‌ చేసుకున్నారు.

మరిన్ని వార్తలు